- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అరోమా థెరపీ అంటే ఏంటి? ఎలాంటి వ్యాధులను నయం చేస్తుంది?
దిశ, ఫీచర్స్ : అరోమాథెరపీ అనేది సహజమైన మొక్కల సారాలను ఉపయోగించే సంపూర్ణ వైద్యం. దీన్ని ఎసెన్షియల్ ఆయిల్ ట్రీట్మెంట్ అని కూడా పిలుస్తారు. ఈ మధ్య బాగా పాపులారిటీ సంపాదించిన ఈ వైద్యాన్ని ఆర్ట్, సైన్స్ గా భావిస్తుండగా... ఆరువేల ఏళ్లుగా వినియోగంలో ఉన్నట్లు తెలుస్తుంది. చైనా, భారత్, ఈజిప్టులోని పురాతన సంస్కృతులు.. సుగంధ మొక్కల భాగాలను నూనెలు, బామ్స్, రెసిన్లలో చేర్చాయి. వైద్య, మతపరమైన ప్రయోజనాల కోసం వినియోగించాయి.
10వ శతాబ్దంలో పర్షియన్లు ఎసెన్షియల్ ఆయిల్స్ వాడినట్లు తెలుస్తోంది. అయితే అప్పటికే చాలా కాలం ముందు వినియోగించవచ్చనే అనుమానాలు ఉన్నాయి. 19వ శతాబ్దంలో ఫ్రెంచ్ వైద్యులు వ్యాధుల చికిత్సలో నూనెల సామర్థ్యాన్ని చక్కగా ఉపయోగించారు. కాగా అరోమా థెరపీ అనే పదం ఫ్రెంచ్ పరిమళ ద్రవ్యం మూలం నుంచి వచ్చింది. రసాయన శాస్త్రవేత్త రెనే మారిస్ గట్టెఫొస్సే 1937లో ప్రచురించిన పుస్తకంలో దీని గురించి ప్రస్తావించారు. కాలిన గాయాలకు చికిత్స చేయడంలో లావెండర్ నూనె సామర్థ్యాన్ని గుర్తించింది ఈయనే కావడం విశేషం. నిజానికి అరోమా థెరపీ.. నూనె వాసన, దాన్ని చర్మం శోషించుకునే విధానంపై ఆధారపడి ఉంటుంది. కాగా వాటిని ఎలా వినియోగించవచ్చు అనేది తెలుసుకుందాం.
- డిఫ్యూజర్లు
- ఇన్హేలర్స్
- క్రీమ్స్, లోషన్స్
- ఫేస్ స్టీమర్స్
- ఫేస్ మాస్క్
- బాత్ సోప్స్
- చల్లని, వేడి కంప్రెసర్స్
ఏ అయిల్స్ బెటర్?
- లావెండర్
- యూకలిప్టస్
- టీ ట్రీ
- పుదీనా
- రోజ్ మేరీ
- క్లారీ ఋషి
ఆరోగ్య ప్రయోజనాలు
- నొప్పి నివారణ
- నిద్ర నాణ్యత మెరుగు
- ఒత్తిడి, ఆందోళన తగ్గుదల
- కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం
- తలనొప్పి, మైగ్రేన్స్ తగ్గుదల
- కీమో థెరపీ దుష్ప్రభావాలు తగ్గుదల
- జీర్ణశక్తి మెరుగు
- రోగనిరోధక శక్తి పెరుగుదల