- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అడ్డగోలుగా మట్టిదందా.. చోద్యం చూస్తున్న అధికారులు
దిశ, సైదాపూర్: గత రెండు, మూడు రోజులుగా కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలోని సోమారం గ్రామంలో నిర్మిస్తున్న రైస్ మిల్లుకు మొరం, ఎర్రమట్టి వచ్చి చేరుతోంది. దీనిపై అధికారులకు ఎన్నిసార్లు స్థానికులు మొరపెట్టుకున్నా, సమాచారం ఇచ్చినా పట్టించుకున్న పాపాన పోవడం లేదు. కనీసం ఫోన్లో కూడా స్పందించడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. మట్టిమాఫియాకు అడ్డుకట్ట వేసేందుకు ఎవరికి ఫిర్యాదు చేయాలో తెలియక ప్రజలు సతమతం అవుతున్నారు. మట్టి లారీలు హుజూరాబాద్, ఇతర ప్రాంతాల నుంచి రవాణా చేసే సమయంలో అతివేగంతో రోడ్డుపై ఎలాంటి ప్రమాదాలు జరుగుతాయోనని గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. ఇటీవల జాగిరిపల్లి గ్రామం నుంచి పట్టా భూమి పేరుతో గుట్టమట్టిని రైస్ మిల్లుకు తరలించగా దిశ దినపత్రికలో వచ్చిన కథనానికి స్పందించిన రెవెన్యూ అధికారులు మట్టి తరలింపును నిలిపేశారు. దీంతో రైస్ మిల్లు ఓనర్ ఇతర ప్రాంతాల నుంచి మొరం, ఎర్రమట్టి రవాణాను యథేచ్ఛగా కొనసాగిస్తున్నాడు. మండలంలోని ఎక్కడ ఇటువంటి అక్రమాలకు జరగకుండా చూడాల్సిన అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాత్రిపూట రోడ్డుపై లారీలు అతివేగంగా వెళ్లడం, లైసెన్సులు లేని వారితోను, అర్హత లేని వారితోనూ లారీలు నడిపించడంతోపాటు వీటికి తోడు శబ్ధాలకు ఎప్పుడు ఏం జరుగుతుందని ఆందోళన చెందుతున్నారు. ఇంత జరుగుతున్నా ఉన్నతాధికారులు మాత్రం కన్నెత్తి చూడకపోవడం దారుణమని ప్రజలు ఆవేదన చెందుతున్నారు. ఈ అక్రమ మట్టి దందాలో అధికార బలం, కరెన్సీ కట్టలను అధికారులకు కాసులు వర్షం కురిపిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కాగా, ధనార్జనే ప్రధాన ధ్యేయంగా మట్టి మాఫియా వ్యవహరిస్తోంది. అధికారులు ఇటీవల పట్టుబడిన లారీలు, ట్రాక్టర్లు, జేసీబీ యంత్రాలను పట్టుకుని నామమాత్రపు జరిమానాలతో సరిపెట్టి వదిలేస్తున్నట్టు సమాచారం. ఇప్పటికైనా మట్టి మాఫియాపై ఉన్నతాధికారులు దృష్టి సారించి కఠిన చర్యలు తీసుకోవాలని మండల ప్రజలు కోరుతున్నారు.