వరుసగా మూడో రోజు భూ ప్రకంపణలు.. భయంతో పరుగులు తీసిన ప్రజలు

by Mahesh |
వరుసగా మూడో రోజు భూ ప్రకంపణలు.. భయంతో పరుగులు తీసిన ప్రజలు
X

దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు జిల్లాలను వరుస భూ ప్రకంపణలు(Earth tremors)వణికిస్తున్నాయి. వివరాల్లోకి వెళితే.. సోమవారం ఉదయం 11 గంటల ప్రాంతంలో ప్రకాశం జిల్లా(Prakasam District)లోని ముండ్లమూరు లో స్వల్ప భూప్రకంపనలు చోటు చేసుకున్నాయి. వరుసగా మూడో రోజు ఈ భూ ప్రకంపణలు రావడంతో స్థానిక ప్రజలు భయాందోళనకు గురయ్యారు. దీంతో ఎమ్ చేయాలో తెలియని స్థితిలో గ్రామంలోని ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. అయితే వరుసగా మూడు రోజులు ఈ ప్రకంపనలు రావడంతో జిల్లా ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తూ.. బయం బయం గా ఇండ్లలో జీవిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed