Diabetic: గుర్తుందా శీతాకాలం.?!.. వాళ్లకి చాలా డేంజర్ అంటున్న నిపుణులు

by sudharani |
Diabetic: గుర్తుందా శీతాకాలం.?!.. వాళ్లకి చాలా డేంజర్ అంటున్న నిపుణులు
X

దిశ, ఫీచర్స్: ప్రపంచవ్యాప్తంగా (worldwide) సంభవిస్తున్న అధిక మరణాలకు మధుమేహమే (Diabetic) ప్రధాన కారణం అని అంటున్నారు ఆరోగ్య నిపుణులు (experts). ముఖ్యంగా మధుమేహ వ్యాధిగ్రస్తులకు చలికాలం (Winter season) ఒక సవాలుగా మారుతుంది. కాబట్టి బ్లడ్‌లో షుగర్ లెవల్స్‌ (sugar levels)ను కంట్రోల్‌ చేసుకోవడానికి చలికాలంలో మరింత శ్రద్ధ చూపించాలని అంటున్నారు డాక్టర్లు. చల్లని ఉష్ణోగ్రత రక్తంలో చక్కెర స్థాయిలను ఎలా ప్రభావితం చేస్తుంది, వాటిని ఎదుర్కొనే మార్గాలు ఏంటి తెలుసుకుందాం.

వాతావరణ ప్రభావితం..

వాతావరణంలో స్థిరమైన చల్లదనం, కదలిక పరిధి తగ్గడం వల్ల మధుమేహ వ్యాధిగ్రస్తులకు శీతాకాలం పెద్ద సమస్యగా మారుతుంది. చల్లని వాతావరణం కారణంగా శరీరంలోని చక్కెర స్థాయిలు తగ్గుతున్న సంకేతాలను గమనించడం కూడా కష్టంగా ఉంటుంది. ఈ చల్లని వాతావరణం శరీరం ఇన్సులిన్ ప్రతిస్పందనను ప్రభావితం చేస్తుంది. దీంతో డయాబెటిస్‌తో బాధపడేవారికి మరింత ఒత్తిడి పెరుగుతుంది. వ్యాధి తీవ్రత కూడా అధికమవుతుంది.

చెక్ చేసుకోండి

ఇలాంటప్పుడు కొంచెం జాగ్రత్త తీసుకొని షుగర్ లెవల్స్ ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవడం ఉత్తమం అని అంటున్నారు నిపుణులు. నిర్లక్ష్యం చేస్తే మరిన్ని అనారోగ్య సమస్యలకు దారితీస్తుందని హెచ్చరిస్తున్నారు. వేడినీళ్ల స్నానం, శ్వాస వ్యాయామాలు చేస్తే మంచిది. అలాగే సిల్క్ దుస్తులు కాకుండా వెచ్చని దుస్తులు వేసుకుంటే చలి తీవ్రతను తగ్గించుకొని మధుమేహ తీవ్రతను నుంచి తప్పించుకోవచ్చు.

నియంత్రణకు చిట్కాలు

డైట్: మధుమేహాన్ని అదుపులో ఉంచుకోవడానికి.. మీ డాక్టర్ సూచించిన విధంగా కచ్చితంగా ఆహార ప్రణాళికను వేసుకోవాలి. జంక్ ఫుడ్ కు దూరంగా ఉండాలి. అలాగే చాక్లెట్లు, కుకీలు, టీ, కాఫీ, షేక్స్ అండ్ కేక్ వంటి అధిక చక్కెర ఉన్న ఆహారాలు తీసుకోవడం వల్ల మరింత హాని కలుగుతుంది.

సమతుల ఆహారం: అవసరమైన పోషకాలతో సమృద్ధిగా ఉన్న సమతుల్య భోజనమే తినాలి. అలాంటి ఫుడ్ తీసుకోవడం వల్ల బ్లెడ్‌లో షుగర్ లెవల్స్ సమానంగా ఉంటాయి.

వెచ్చని దుస్తులు: చల్లని వాతావరణం నుంచి కాపాడుకోవాలంటే ముఖ్యంగా ఉన్ని లాంటి వెచ్చని, సౌకర్యవంతమైన దుస్తులు ధరించాలి. శరీరానికి వెచ్చదానాన్ని ఇచ్చే దుస్తులు ధరించడం వల్ల మీ రక్తంలో చక్కెర స్థాయిలు సమాంతరంగా ఉంటాయి.

వేళకు తినండి: టైం టూ టైం భోజనం చేయడం వల్ల కూడా శరీరంలో చక్కెర స్థాయిలు అనుకూలంగా ఉంటాయి. అలాగే తరచుగా రక్తంలో చక్కెరను చెక్ చేసుకోవాలి. అయితే.. కొతంమంది చల్లటి వాతావరణం కారణంగా చలికాలంలో నీరు ఎక్కువగా తాగరు. దీనివల్ల డీహైడ్రేషన్‌కు గురయ్యే ప్రమాదం ఉంది.

సొంత ప్రయత్నాలు వద్దు: కొంత మంది షుగర్ లెవర్స్ పెరిగినా లేదా తగ్గినా, డీహైడ్రేషన్‌కు గురైనా సొంత ప్రయత్నాలు చేస్తుంటారు. ఇలా చేయడం అన్నిసార్లు మంచిది కాదంటున్నారు నిపుణులు. ఎందుకంటే ఇది చికిత్సను ఆలస్యం చేయడంతో పాటు ప్రతికూల ఫలితాలకు దారితీస్తుంది. కాబట్టి.. మీకు ఏవైనా అసాధారణ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించడం మంచిదని సూచిస్తున్నారు.

Advertisement

Next Story