- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
IndiGo: ఇండిగో స్పెషల్ ఆఫర్.. రూ. 1,200కే విమాన టికెట్
దిశ, బిజినెస్ బ్యూరో: ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో ప్రత్యేక 'గెట్అవే సేల్ 'ను ప్రకటించింది. దేశీయ, అంతర్జాతీయ విమాన ప్రయాణాలపై తగ్గింపు ధరకే టికెట్లు అందిస్తామని సోమవారం ప్రకటనలో వెల్లడించింది. డిసెంబర్ 25 వరకు ఇండిగో ఈ సేల్ నిర్వహిస్తోంది. దేశీయ ప్రయాణానికి రూ.1,199, అంతర్జాతీయ ప్రయాణాలకు రూ.4,499కే టికెట్ ధరను అందుబాటులో ఉంచుతున్నట్లు తెలిపింది. 2023 జనవరి 15 నుంచి ఏప్రిల్ 14 మధ్య ప్రయాణానికి ఈ టికెట్లు బుక్ చేసుకోవచ్చని ఇండిగో ఓ ప్రకటనలో పేర్కొంది. తగ్గింపు ధరలతో పాటు ఎంపిక చేసిన కంపెనీ 6ఈ యాడ్-ఆన్‌లపై గరిష్ఠంగా 15 శాతం డిస్కౌంట్ అందిస్తోంది. ఇందులో ప్రీపెయిడ్ అడిషనల్ బ్యాగేజీ(15కిలో, 20కిలో, 30కిలో), స్టాండర్డ్ సీట్ సెలెక్షన్, ఎమర్జెన్సీ ఎక్స్ఎల్ సీట్ ఎంచుకునే వెసులుబాటు ఉంది. ఈ యాడ్-ఆన్‌లు దేశీయంగా రూ. 599, అంతర్జాతీయ విమానాలకు రూ. 699 నుంచి ప్రారంభమవుతున్నాయి. ఇవి మాత్రమే కాకుండా ఇండిగో ఫెడరల్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌లతో చేసిన బుకింగ్‌లకు అదనపు తగ్గింపులను అందించడానికి ఫెడరల్ బ్యాంక్‌తో సంస్థ భాగస్వామ్యం కుదుర్చుకుంది. దీని ద్వారా డిసెంబరు 31లోపు బుకింగ్‌లను పూర్తి చేసిన కస్టమర్‌లు దేశీయంగా 15 శాతం, అంతర్జాతీయ విమానాలపై 10 శాతం ఫ్లాట్ డిస్కౌంట్‌లను పొందవచ్చని ఎయిర్‌లైన్ కంపెనీ పేర్కొంది.