- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Jaishankar : కేంద్ర మంత్రి జైశంకర్ యూఎస్ టూర్ డేట్ ఫిక్స్
X
దిశ, నేషనల్ బ్యూరో : కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్ నేటి(మంగళవారం) నుంచి 29వ తేదీ వరకు అమెరికాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో కీలకమైన ద్వైపాక్షిక, ప్రాంతీయ, ప్రపంచ అంశాలపై చర్చించనున్నారు. ప్రధానంగా భారత్-అమెరికా బంధాన్ని మరింత బలోపేతం చేయడంపై మాట్లాడనున్నారు. ప్రపంచ సవాళ్లను ఎదుర్కోవడం, వివిధ రంగాల్లో లోతైన సహకారం కోసం మార్గాలను అన్వేషించడంపై దృష్టి సారించనున్నారు. ఈ పర్యటనలో జై శంకర్ యునైటెడ్ స్టేట్స్‌లోని భారత కాన్సుల్ జనరల్స్ సమావేశానికి అధ్యక్షత వహిస్తారు. మొత్తం ఆరు రోజుల పాటు ఈ పర్యటన సాగనుంది. ట్రంప్ ఇటీవల ఎన్నికల్లో గెలిచి ప్రెసిడెంట్‌గా వచ్చే నెల ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో తాజా పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది.
Advertisement
Next Story