కల చెదిరింది…కన్నీరే మిగిలింది..

by Kalyani |
కల చెదిరింది…కన్నీరే మిగిలింది..
X

దిశ,నెక్కొండ : సర్కార్ కొలువు సాధించి ఆశయం నెరవేరిందని కలలు కన్న చీకటి.రాకేష్ (24 సం"లు) అనే యువకుడికి అనారోగ్యం రావడం అతని పాలిట శాపంగా మారింది. ఈ విషాదకర ఘటన వరంగల్ జిల్లా నెక్కొండ మండలం అలంఖానిపేట గ్రామంలో చోటు చేసుకుంది. చీకటి.యాకలక్ష్మి ఉపేందర్ దంపతుల కుమారుడు రాకేష్ ఇటీవల టీఎస్పీఎస్సీ సివిల్ కానిస్టేబుల్ ఉద్యోగానికి సెలెక్ట్ అయ్యాడు. ప్రస్తుతం శిక్షణ పొందుతున్నాడు. ఈ నెల 27 తేదీ డ్యూటీ లో జాయిన్ కావాల్సి ఉంది. పదిహేను రోజుల క్రితం జ్వరం రావడంతో హైద్రాబాద్ లోని ఒమేగా హాస్పిటల్ లో సోమవారం ఉదయం బ్లడ్ క్యాన్సర్ తో మృతి చెందాడు. చేతికి వచ్చిన కుమారుడు మృతి చెందడంతో కుటుంబసభ్యులు రోదన చూసి గ్రామస్తులు సైతం కన్నీరుమున్నీరుగా విలపించారు.

Advertisement

Next Story

Most Viewed