Shamshabad: విమానాశ్రయ సమీపంలో భారీ అగ్ని ప్రమాదం

by Gantepaka Srikanth |
Shamshabad: విమానాశ్రయ సమీపంలో భారీ అగ్ని ప్రమాదం
X

దిశ, వెబ్‌డెస్క్: రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయ(Shamshabad Airport) సమీపంలో భారీ అగ్నిప్రమాదం(Fire Accident) చోటుచేసుకుంది. నిర్మాణంలో ఉన్న అమర్‌రాజా బ్యాటరీ కంపెనీ(Amar Raja Battery Company)లో సోమవారం సాయంత్రం ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మూడో అంతస్తులో మంటలు ఎగిసిపడటంతో గమనించిన ఉద్యోగులు భయంతో పరుగులు తీశారు. అనంతరం పోలీసులు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది. మంటలను ఆర్పేప్రయత్నం చేస్తున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Next Story

Most Viewed