Ajit Pawar: కొత్తవారికి అవకాశం ఇవ్వాలి.. భుజ్ బల్ వ్యాఖ్యలపై అజిత్ పవార్ కౌంటర్

by Shamantha N |
Ajit Pawar: కొత్తవారికి అవకాశం ఇవ్వాలి..  భుజ్ బల్ వ్యాఖ్యలపై అజిత్ పవార్ కౌంటర్
X

దిశ, నేషనల్ బ్యూరో: ఎన్సీపీ(NCP) ఎమ్మెల్యే ఛగన్ భుజ్ బల్ విమర్శలపై ఆ పార్టీ అధినేత, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ (Ajit Pawar) స్పందించారు. మహారాష్ట్ర ప్రభుత్వ మంత్రివర్గంలో చోటు కల్పించకపోవడంతో అజిత్‌ పవార్‌పై ఆ పార్టీ సీనియర్‌ నాయకుడు ఛగన్‌ భుజ్‌బల్‌ (Chhagan Bhujbal) తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ వ్యాఖ్యలపై తొలిసారి అజిత్‌ పవార్‌ స్పందించారు. భుజ్‌బల్‌ పేరు ప్రస్తావించకుండానే ఆయన విమర్శలకు జవాబిచ్చారు. ‘‘కొన్ని సార్లు మంత్రివర్గంలో కొత్త వ్యక్తులకు అవకాశం ఇవ్వాల్సి ఉంటుంది. ఇప్పుడు కూడా అదే జరిగింది. మంత్రివర్గంలోకి తీసుకోవాలని కొందరు (భుజ్‌బల్‌ను ఉద్దేశిస్తూ) ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అపార్థాలు సృష్టిస్తున్నారు. ఇది మాత్రం ఆమోదయోగ్యం కాదు. సీనియర్లకు కేంద్రమంత్రివర్గంలో చోటు దక్కేలా ఆలోచనలు చేస్తున్నాం’’ అని అజిత్‌ పవార్‌ స్పష్టం చేశారు.

ఛగన్ బల్ ఏమన్నారంటే?

మహారాష్ట్ర కేబినేట్ విస్తరణలో భుజ్ బల్ కు చోటు దక్కుతుందని ఆశించారు. కాకపోతే, ఆయనకు నిరాశే మిగిలింది. మంత్రి పదవి గురించి అజిత్‌ పవార్‌ సహా కార్యనిర్వాహక అధ్యక్షుడు ప్రఫుల్‌ పటేల్‌ తనతో మాట్లాడుతామన్నారని.. కానీ, తర్వాత దాని గురించి ఎలాంటి సమాచారం ఇవ్వలేదన్నారు. సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌ తనను మంత్రి వర్గంలోకి తీసుకునేందుకు ఆసక్తి చూపారని.. కానీ, సొంత పార్టీ నేతలే అడ్డుకున్నారని భుజ్‌బల్‌ ఆరోపించారు. వాళ్లు చెప్పినట్లు ఆడేందుకు.. వారి చేతిలో కీలుబొమ్మ కాదని మండిపడ్డారు. ఈ వ్యాఖ్యలపైనే అజిత్ పవార్ స్పందించారు.

Advertisement

Next Story

Most Viewed