Mumbai Ferry Crash: ముంబై ఫెర్రీ ప్రమాదం కేసులో బయటకొస్తున్న సంచలనాలు

by Shamantha N |
Mumbai Ferry Crash: ముంబై ఫెర్రీ ప్రమాదం కేసులో బయటకొస్తున్న సంచలనాలు
X

దిశ, నేషనల్ బ్యూరో: అరేబియా సముద్రంలో నేవీ బోటు(Mumbai Ferry boat), ఫెర్రీని ఢీకొన్న ప్రమాదానికి కీలక విషయాలు బయటకొస్తున్నాయి. స్టీరింగ్‌లో సాంకేతికలోపం తలెత్తడం, వేగాన్ని నియంత్రించే త్రోటల్‌ క్వాడ్రంట్ కూడా సరిగా పని చేయకపోవడమే ఈ ప్రమాదానికి కారణమంటూ నేవీ సంబంధిత వర్గాలు తెలిపాయి.ఈ లోపాల గురించి క్రూ సిబ్బందికి ముందే అవగాహన ఉందని సమాచారం. గత వారం ముంబై (Mumbai) తీరం సమీపంలోని ప్రసిద్ధ ఎలిఫెంటా దీవిని సందర్శించేందుకు వెళ్తున్న పర్యటకుల ఫెర్రీని ఇంజిన్ ట్రయల్స్‌లో(Mumbai Ferry Crash) భాగంగా అతివేగంతో వెళ్లిన బోట్‌ ఢీకొనడం వల్ల ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనపై మహారాష్ట్ర మారిటైమ్ బోర్డ్‌ (MMB) దర్యాప్తు చేపడుతోంది. ఫెర్రీ లైసెన్స్‌ రద్దు చేసింది. అలాగే కొలాబా పోలీస్‌స్టేషన్ పరిధిలో నేవీ బోట్ డ్రైవర్‌పై కేసు నమోదైంది.

ఫెర్రీ లైసెన్స్ రద్దు

అరేబియా సముద్ర జలాల్లో ఇటీవల పర్యటకుల ఫెర్రీని నేవీకి చెందిన స్పీడ్‌ బోటు ఢీకొట్టిన ఘటనలో 15 మంది చనిపోయారు. దీనికి సంబంధించిన విషయాలు వెల్లడయ్యాయి. అప్పుడు ఫెర్రీలో 113 మంది ప్రయాణికులు ఉన్నారు. వారిలో 98 మందిని రక్షించారు. నిబంధనల ప్రకారం.. అందులో 84 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బంది మాత్రమే ఎక్కాల్సిఉంది. దీంతో, ఎంఎంబీ ఫెర్రీ లైసెన్స్ రద్దు చేసింది. నేవీ క్రాఫ్ట్ డ్రైవర్‌పై భారతీయ న్యాయ సంహిత (BNS)లోని వివిధ సెక్షన్ల కింద కోల్బా పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు అయ్యింది. నేవీ క్రాఫ్ట్ ప్రస్తుతం నేవీ అధికారుల కస్టడీలో ఉంది. అయితే, పోలీసులు తమ విచారణ కోసం అవసరమైన విధంగా నేవీని యాక్సెస్ చేయమని అభ్యర్థిస్తారని సూచించింది.

Advertisement

Next Story