అమరావతిలో నిర్మాణాల పూర్తిపై మంత్రి నారాయణ కీలక ప్రకటన

by srinivas |
అమరావతిలో నిర్మాణాల పూర్తిపై మంత్రి నారాయణ కీలక ప్రకటన
X

దిశ, వెబ్ డెస్క్: అమరావతి(Amaravati) నిర్మాణం పూర్తిపై మంత్రి నారాయణ కీలక ప్రకటన చేశారు. ఏపీ రాజధాని(AP Capital)పై ఎవరెంత దుష్ప్రచారం చేసినా మూడేళ్లలో నిర్మాణం పూర్తి చేస్తామని ఆయన వెల్లడించారు. పోర్టులు ఉన్న ప్రాంతాల్లో శాటిలైట్ సిటీలు నిర్మిస్తామని, ఇందుకు అమరావతి తరహాలో ల్యాండ్ పూలింగ్ ద్వారా భూములు సేరిస్తామని తెలిపారు. పోర్టులు, మానుఫాక్చర్, ఎలక్ట్రానిక్, ఐటీ పరిశ్రమలతో అన్ని ప్రాంతాలు అభివృద్ధి చేస్తున్నామన్నారు. ప్రజలపై ఎలాంటి భారం మోపమని, లోన్లు తీసుకుని తీరుస్తామని చెప్పారు. అమరావతిలో వచ్చే ఆదాయంతోనే తిరిగి రుణాలు చెల్లిస్తామన్నారు. అమరావతి కోసం తీసుకున్న భూములను అమ్మకానికి పెడతామని, అలా లోన్‌లు కడతామన్నారు. అమరావతిపై వైసీపీ నాయకులు ఇంకా దుష్ప్రచారాలు చేస్తూనే ఉన్నారని మండిపడ్డారు. వైసీపీ నాయకులు ఊహించనవి విధంగా అమరావతి పనులను పరుగులు పెట్టిస్తామని మంత్రి నారాయణ చెప్పారు.

Advertisement

Next Story

Most Viewed