- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Kavitha: రేవంత్ రెడ్డి రెండు నాల్కల ధోరణి.. కామారెడ్డి రైతుల విషయంలో కవిత విమర్శలు
దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికలకు ముందు ఓ మాట ఎన్నికల్లో గెలిచాక మరో మాట మాట్లాడుతూ రెండు నాల్కల ధోరణి అవలంభిస్తున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించారు. కామారెడ్డి జిల్లా నస్రుల్లాబాద్ మండలంలోని మైలారం, దుర్కి, నస్రుల్లాబాద్, మిర్జాపూర్, నాచుపల్లిలో ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల్లో రుణాలు తీసుకున్న రైతుల భూములను వేలం వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుండటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు. రుణాలు మాఫీ చేసి అన్నదాతకు అండగా ఉండాల్సిన ప్రభుత్వం, డబ్బులు కట్టాలంటూ అంకోల్ తండాలో రైతులపై ఒత్తిడి తీసుకురావడం, బలవంతంగా భూముల వేలానికి ప్రయత్నించడం నియంతృత్వ పాలనను తలపిస్తోందని ఆమె ఎక్స్ వేదికగా ధ్వజమెత్తారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో, అంకోల్ తండా ప్రజలను ఆదుకుంటానని నమ్మించి ఇప్పుడు రైతులను అప్పు చెల్లించాలంటూ వేధించడం, రైతులకు రేవంత్ రెడ్డి సర్కారు చేస్తున్న నమ్మక ద్రోహానికి నిదర్శనం అన్నారు. కాగా కామారెడ్డి జిల్లా నస్రుల్లాబాద్ మండలంలో గత ప్రభుత్వ హయాంలో బకాయిల వసూలు కోసం రైతు ఇంటి తలుపు తీయడాన్ని ప్రతిపక్షంలో ఉండగా సీఎం ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. తన పాదయాత్ర సందర్భంగా నాడు అంకోల్ గ్రామ రైతులతో మాట్లాడిన రేవంత్ రెడ్డి తాము అధికారంలోకి వస్తే సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చారని ఇప్పుడు తమ భూములను వేలం వేసేందుకు ప్రయత్నిస్తున్నారని ప్రభుత్వం తమను ఆదుకోవాలని బాధిత రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు.