- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అసంపూర్తిగా అమ్మ ఆదర్శ పనులు..
దిశ, ఆసిఫాబాద్ : ప్రభుత్వాలు, పాలకులు మారుతున్నా జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మాత్రం మారడం లేదు. అధికారంలోకి వచ్చిన ప్రతిసారీ కొత్త పథకం పేరుతో ఆయా ప్రభుత్వాలు పాఠశాలల మౌలిక సదుపాయాల కల్పనకు కోట్ల రూపాయలు వెచ్చించి ఖర్చు చేస్తోంది. క్షేత్రస్థాయిలో నిర్లక్ష్యమో.. అధికారుల పర్యవేక్షణ లోపమో కానీ ఎక్కడ పూర్తిస్థాయిలో పనులు జరిగిన పాపాన పోలేదు. ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలను మార్చాలనే లక్ష్యంతో కాంగ్రెస్ సర్కార్ అమ్మ ఆదర్శ పాఠశాలల పేరిట చేపట్టిన పనులు జిల్లాలో నత్తనడకన సాగుతున్నాయి. అమ్మ ఆదర్శ పాఠశాలల కార్యక్రమంలో భాగంగా 6 నెలల క్రితం జిల్లాలో 739 పాఠశాలలను ఎంపిక చేయగా అందులో 446 పాఠశాలల్లో రూ. 17 కోట్ల 74 లక్షలు వెచ్చించి 90 శాతం పనులు పూర్తి చేసినట్లు విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. కానీ గ్రామాల్లో ఎక్కడ కూడా ఆ స్థాయిలో పనులు జరుగలేదు. ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా పనులు చేయించాల్సి అధికారులు కమీషన్ మత్తులో పడి పట్టించుకోవడం లేదని ఆరోపణలు ఉన్నాయి.
ఇప్పటికీ పూర్తికాని పనులు..
జిల్లాలో మొత్తం 12 వందలకు పైగా ప్రభుత్వ పాఠశాలలు ఉండగా వాటిలో 739 పాఠశాలల్లో అమ్మ ఆదర్శ పాఠశాలల పనులు చేపట్టేందుకు జిల్లా కలెక్టర్ విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకున్నారు. స్థానిక పాఠశాలల్లో కమిటీలు వేసి అమ్మ ఆదర్శ కమిటీల భాగస్వామ్యంతో పనులు నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించింది. పలుచోట్ల అమ్మ ఆదర్శ కమిటీల సభ్యులు పనులు చేసినప్ప టికీ, మరికొన్నిచోట్ల వారు ఆసక్తి చూపకపోవడంతో అధికారులు కాంట్రాక్టర్లకు పనులు అప్పగించినట్లు తెలుస్తోంది. ఈ పనుల్లో భాగంగా చేపట్టిన తరగతి గదులు, మరుగుదొడ్ల నిర్మాణం, పాడైపోయిన వాటిని బాగు చేయడం కరెంట్ సరఫరా ఫ్యాన్లు, మంచినీటి సౌకర్యం వంటి పనులను పాఠశాలల పునఃప్రారంభం నాటికే పూర్తి కావాల్సి ఉన్నప్పటి కొన్నిచోట్ల కొనసాగుతుండగా, మరికొన్నిచోట్ల అసంపూర్తిగా మిగిలిన ఉన్నాయి.
మరుగుదొడ్లకు నీటి సౌకర్యం కరువు..
అమ్మ ఆదర్శ పాఠశాలల పేరిట చేపట్టిన అభివృద్ధిలో విద్యార్థులు వినియోగించే మరుగుదొడ్లకు కనీసం మంచినీటి సౌకర్యం కూడా కల్పించలేదు. వాంకిడి మండలంలోని రాజుల్ గూడ, గణేష్ పూర్ గిరిజన సంక్షేమ ప్రాథమిక పాఠశాలల్లో పనులు చేపట్టిన సదరు కాంట్రాక్టర్ మరుగుదొడ్లకు నాలాలు ఏర్పాటు చేశాడు.. కానీ వాటర్ సరఫరా చేసే వాటర్ ట్యాంక్ ను పిల్లలు చదువుకునే గది ఉంచారు. అలాగే కరెంట్ కనెక్షన్ కూడా ఇంకా ఇవ్వలేదు. చేసిన పనులు సైతం పూర్తి నాసిరకం ఉన్నాయి. బంబార, మినహా మిగతా గిరిజన సంక్షేమ పాఠశాలల్లో ఎక్కడ కూడా పనులు జరుగలేదని స్థానిక గ్రామస్థులు చెబుతున్నారు.