సీఎం సార్ న్యాయం చేయాలంటూ.. ఎంపీ బలరాం నాయక్ కు గురుకుల అభ్యర్థుల విన్నపం

by Mahesh |
సీఎం సార్ న్యాయం చేయాలంటూ.. ఎంపీ బలరాం నాయక్ కు గురుకుల అభ్యర్థుల విన్నపం
X

దిశ, మహబూబాబాద్ టౌన్: ఏండ్ల తరబడి కుటుంబాలకు దూరంగా శిక్షణ పొంది గురుకుల పరీక్షలు ఎదుర్కొన్నట్లు గురుకుల డౌన్ మెరిట్ లిస్ట్ అభ్యర్థులు దుఃఖక్రాంతులయ్యారు. శనివారం మానుకోట ఎంపీ పోరిక బలరాం నాయక్‌ను కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. డిగ్రీ, జూనియర్ లెక్చరర్, పీజీటీ టీచర్ ఉద్యోగాలకు పోటీ పరీక్షలో కామన్ పేపర్ నిర్వహించడం ఒక్క అభ్యర్థికే రెండు మూడు ఉద్యోగాలకు ఎంపికయ్యారు. పోస్టుల భర్తీలో డిసెండింగ్ ఆర్డర్ పాటించకపోవడంతో దాదాపు మూడు వేల పోస్టులు బ్యాక్లాగ్ అవుతున్నట్లు తెలిపారు. న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చినట్లు గుర్తు చేశారు. తమ బాధను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు వివిధ హోదాల్లోని ప్రజా ప్రతినిధులకు, అధికారులకు విన్నవించుకున్నట్లు తెలిపారు.డౌన్ మెరిట్ లిస్ట్ ప్రకటించి తమ కుటుంబాల్లో వెలుగులు నింపాలని వేడుకున్నారు.అభ్యర్థులు తూము విజయ్ మనోహర్, ఎర్రం శ్రీనివాస్,గుగులోత్ కిషన్ నాయక్, బాల్నే నరేష్,బాణోత్ శ్రీను,సతీష్ తదితరులున్నారు.

Advertisement

Next Story

Most Viewed