కొలిక్కి వచ్చిన తిరువూరు పంచాయితీ.. సరిదిద్దుకుంటానన్న కొలికపూడి

by srinivas |   ( Updated:2024-10-05 16:53:26.0  )
కొలిక్కి వచ్చిన తిరువూరు పంచాయితీ.. సరిదిద్దుకుంటానన్న కొలికపూడి
X

దిశ, వెబ్ డెస్క్: కృష్ణా జిల్లా తిరువూరు పంచాయితీ ఎట్టకేలకు కొలిక్కి వచ్చింది. చిట్టేల సర్పంచ్ శ్రీనివాసరావు, ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు మధ్య విభేదాలు తలెత్తాయి. తన భర్త సర్పంచ్ శ్రీనివాసరావుపై ఎమ్మెల్యే కొలికిపూడి అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ భార్య కవిత ఆత్మహత్యాయత్నం చేశారు. దీంతో వివాదం మరింత ముదిరింది. అంతేకాదు నియోజకవర్గంలో పలువురి పట్ల అనుచితంగా వ్యవహరించారని కొలికిపూడిపై ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో ఎమ్మెల్యే శ్రీనివాసరావుపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడికి ఫిర్యాదులు అందాయి.

అయితే తనపై చేసిన ఆరోపణలను నిరూపించాలంటూ కొలికిపూడి దీక్షకు దిగడం, చంద్రబాబు ఫోన్ చేయడం, ఆ తర్వాత విరమించడం వంటి పరిణాలు జరిగాయి. దీంతో ఈ పంచాయితీ మంగళగిరి టీడీపీ కార్యాలయానికి చేరింది. తాజాగా ఈ పంచాయితీ కొలిక్కి వచ్చింది. ఎన్టీఆర్ భవన్‌లో కొలికిపూడితో ఎంపీ కేశినేని, వర్ల రామయ్య, సత్యనారాయణ రాజు మాట్లాడి తిరువూరు పంచాయితీకి తెర దించారు. ఈ మేరకు ఎమ్మెల్యే కొలికిపూడి మీడియాతో మాట్లాడారు. ‘‘నా వల్ల కొందరికి ఇబ్బందులు వస్తాయని ఊహించలేదు. నా వల్ల తలెత్తిన ఇబ్బందులు సరిచేసుకుంటా. నా పనితీరుతో క్యాడర్‌లో సమన్వయ లోపం ఏర్పడింది. ఆదివారం పార్టీ ప్రతినిధుల ఆధ్వర్యంలో తిరువూరులో కార్యకర్తల సమావేశం నిర్వహిస్తా. నా వల్ల తలెత్తిన సమస్యలను సరిదిద్దుకోవాల్సిన బాధ్యత కూడా నాదే’’ అని ఎమ్మెల్యే కొలికపూడి చెప్పారు.

Advertisement

Next Story

Most Viewed