చంద్రబాబు, రేవంత్ చర్చలు.. బుద్దా వెంకన్న కీలక కామెంట్స్

by srinivas |
చంద్రబాబు, రేవంత్ చర్చలు.. బుద్దా వెంకన్న కీలక కామెంట్స్
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు హైదరాబాద్‌లో తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డిని శనివారం కలిశారు. ఏపీ, తెలంగాణ మధ్య నెలకొన్న విభజన సమస్యల పరిష్కారంపై చర్చించారు. ఇందుకు ఇద్దరు సీఎంలు సానుకూలత వ్యక్తం చేశారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సైతం ఏపీ వెళ్లి చర్చలు జరపాలని నిర్ణయంచుకున్నారు. అయితే సమస్యల పరిష్కారంపై రెండు కమిటీలు వేశారు. ఈ కమిటీలు ఇచ్చే నివేదిక ద్వారా సమస్యలను చెక్ పెట్టాలని నిర్ణయించారు.

అయితే ఏపీ సీఎం రాసిన లేఖ వల్లే రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న సమస్యలకు పరిష్కార మార్గం అయిందని టీడీపీ నేత బుద్దా వెంకన్న అన్నారు. విభజన సమస్యల పరిష్కారం కోసం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని ఏపీకి పిలిచి మాట్లాడే ప్రొఫైల్ చంద్రబాబుకు ఉందన్నారు. అయినా సరే ఓ మెట్టు దిగి తెలంగాణకు వెళ్లి జరిపారని చెప్పారు. త్వరలోనే అన్ని సమస్యలు పరిష్కారమవుతాయన్నారు. అప్పుల ఊబిలో ఆంధ్రప్రదేశ్ కూరుకుపోయిందని, ఏ ఒక్క శాఖలోనూ డబ్బులు లేవని చెప్పారు. ఏపీ వాటా కోసం తమ అధినేత చంద్రబాబు ఒక అడుగు ముందుకు వేసి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో చర్చలు జరిపారని బుద్దా వెంకన్న తెలిపారు.

Advertisement

Next Story