మీ ఫ్రెండ్ కి కోపం ఎక్కువగా వస్తుందా.. అయితే, ఇలా కూల్ చేసేయండి!

by Prasanna |
మీ ఫ్రెండ్ కి కోపం ఎక్కువగా వస్తుందా.. అయితే, ఇలా కూల్ చేసేయండి!
X

దిశ, ఫీచర్స్ : ఒక మనిషి జీవితంలో ఎవరో ఒక స్పెషల్ పర్సన్ ఉంటారు. వారు ఎవరో కాదు మన స్నేహితుడు/ స్నేహితురాలు. ఒకరి లైఫ్ లో స్నేహితులు కీలక పాత్ర పోషిస్తారు. సమస్య వచ్చినపుడే తెలుస్తుంది వారి విలువ. కొంత మంది గొడవలు జరగగానే విడిపోతుంటారు.. అక్కడ నిజమైన స్నేహం లేనట్టే.. ఎన్ని గొడవలు జరిగినా విడిపోకుండా ఉండే వాళ్లే నిజమైన స్నేహితులు. వీరి మధ్య కూడా విబేధాలు రావడం సహజం. అనుకోకుండా కొన్ని సార్లు మీ ఫ్రెండ్ కి మీ మీద విపరీతమైన కోపం వచ్చేస్తుంటుంది. అలాంటి సమయంలో ఈ చిట్కాలను పాటించి వారిని కూల్ చేయండి.

క్షమాపణ చెప్పడం

మీ ఫ్రెండ్ మీ, మీద బాగా కోపంగా ఉన్నప్పుడు మీరు ముందుగా క్షమాపణలు చెప్పడం నేర్చుకోండి. ఇలా చెప్పడం వలన మీ బంధం బలపడుతుంది. మనకి నచ్చిన స్నేహితుని కోసం కొన్ని సార్లు తగ్గినా తప్పు లేదని అనుకోవాలి.

ఫ్రెండ్ తో లంచ్/ డిన్నర్

మీ ఫ్రెండ్ తో లంచ్/ డిన్నర్ కి ప్లాన్ చేయండి. అక్కడ మీరు ఎందుకు తప్పు చేయాల్సి వచ్చిందో వివరించి చెప్పండి. అలాంటి పొరపాటు మళ్లీ జరగదని మీ స్నేహితుడికి మాట ఇవ్వాలి. ఇలా చెప్పడం వలన మీ స్నేహితునికి మీ మీద నమ్మకం పెరుగుతుంది.

గిఫ్ట్

మీరు స్నేహితుడికి ఫోటో ఫ్రేమ్ గిఫ్ట్ ఇవ్వండి. దానిలో మీ ఇద్దరి ప్రత్యేక ఫోటోలను పెట్టండి. సరదాగా ఒక పాట పాడి వారిని హాగ్ చేసుకుని, పాత స్నేహానికి మరలా ప్రాణం పోయండి.

Next Story

Most Viewed