- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
చైనాలో టెస్ట్ రన్ ఫెయిల్.. అడవుల్లో కూలిన రాకెట్
దిశ, డైనమిక్ బ్యూరో: చైనాలో ఓ ప్రైవేటు ఏరోస్పేస్ రాకెట్ గాల్లోకి ఎగిరిన 30 సెకన్లలోనూ బ్లాస్ట్ అయింది. కంప్యూటర్లు పనిచేయకపోవడంతో ఘటన జరిగిందని శాస్త్రవేత్తలు తాజాగా తెలిపారు. ఆదివారం చైనీస్ టియాన్‌లాంగ్-3 రాకెట్ సెంట్రల్ చైనాలోని పెనాన్ ప్రావిన్స్‌లో ప్రయోగం చేపట్టారు. టేకాఫ్ అయిన 30 సెకన్లలోనే టెస్ట్ రన్ ఫెయిల్యూర్ అయింది. దీంతో అది అంతరిక్షంలోకి వెళ్లక ముందే లాంచ్ ప్యాడ్ నుంచి 1.5 కిలోమీటర్లలో ఉన్న అడవిలో రాకెట్ కూలిపోయింది. ఇది చైనాలోని X ప్రైవేటు ఏరోస్పేస్ కంపెనీకి చెందిన రాకెట్ అని తెలిసింది.
పేలుడు కారణంగా ఎవరూ గాయపడలేదని చైనా మీడియా, స్పేస్ పయనీర్ వెల్లడించాయి. కాగా, రాకెట్ పేలిన దృష్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. రాకెట్ గాల్లోకి ఎగిరి కొన్ని సెకన్లలో బ్లాస్ట్ అయింది. తర్వాత రాకెట్ భాగం పల్టీలు కొట్టుకుంటు ప్రయోగ కేంద్రానికి 1.5 కిలోమీటర్ల దూరంలోని అడవిలో కూలిపోయింది. కింద పడ్డ సమయంలో కూడా భారీగా పేలుడు సంభవించింది. దీంతో ఒక్కసారిగా ప్రాంతమంతా పూర్తిగా పొగలతో కమ్ముకపోయింది.