అన్ని మిలియన్ల వ్యూస్‌లతో దూసుకుపోతున్న ఆ సాంగ్.. వన్ మెలోడీ అంటూ ఇంట్రెస్టింగ్ పోస్ట్

by Kavitha |   ( Updated:2025-04-12 05:54:12.0  )
అన్ని మిలియన్ల వ్యూస్‌లతో దూసుకుపోతున్న ఆ సాంగ్.. వన్ మెలోడీ అంటూ ఇంట్రెస్టింగ్ పోస్ట్
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్(Sharwanandh) నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘నారీ నారీ నడుమ మురారీ’(Nari Nari Naduma Murari). ఇక దీనికి రామ్ అబ్బరాజు(Ram Abbaraju) దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీలో యంగ్ బ్యూటీ సంయుక్త మీనన్(Samyuktha Menon), సాక్షి వైద్య(Sakshi Vaidhya) హీరోయిన్లుగా నటిస్తున్నారు. అయితే ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్, అడ్వెంచర్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ బ్యానర్స్ పై అనిల్ సుంకర(Anil Sunkara), రామబ్రహ్మం సుంకర(Ramabrahmam Sunkara) నిర్మిస్తున్నారు.

అయితే ఈ సినిమాకు బాలయ్య(Balakrishna) మూవీ టైటిల్ ఫిక్స్ చేయడంతో ఈ చిత్రం పై ఆసక్తి నెలకొంది. కాగా ఈ సినిమాకు విశాల్ చంద్ర శేఖర్(Vishal Chandrashekhar) సంగీతం అందిస్తున్నాడు. అయితే రీసెంట్‌గా ఈ మూవీ నుంచి లవ్ సాంగ్ ‘దర్శనమే’ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ మెలోడి సాంగ్ యూట్యూబ్‌లో దూసుకుపోతుంది. ఏకంగా వన్ మినియన్ల వ్యూస్ సాధించి ట్రెండింగ్‌లో కొనసాగుతుంది. ఇక ఈ విషయాన్ని తెలుపుతూ మూవీ టీమ్ ఎక్స్ వేదికగా ‘ఒక మిలియన్ హృదయాలు, వన్ మెలోడి’ అనే క్యాప్షన్ జోడించారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది.

Next Story

Most Viewed