Sambarala Yetigattu: సంబరాల ఏటిగట్టు నుంచి మెగా హీరో పోస్టర్ రిలీజ్.. హైప్ పెంచుతున్న లుక్

by Kavitha |   ( Updated:2025-04-12 05:52:52.0  )
Sambarala Yetigattu: సంబరాల ఏటిగట్టు నుంచి మెగా హీరో పోస్టర్ రిలీజ్.. హైప్ పెంచుతున్న లుక్
X

దిశ, వెబ్‌డెస్క్: మెగా హీరో సాయి ధరమ్ తేజ్(Sai Dharam Tej) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ‘పిల్లా నువ్వు లేని జీవితం’(Pilla Nuvvu Leni Jeevitham) సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి.. ఫస్ట్ మూవీతోనే మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రస్తుతం ఆయన రోహిత్ కేపీ(Rohit KP) దర్శకత్వంలో ‘సంబరాల ఏటిగట్టు’(Sambara Yetigattu) అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఇక ఇప్పటికే ఈ మూవీ నుంచి వచ్చిన టైటిల్ గ్లింప్స్‌లో తేజ్ కనిపించిన తీరు చూసి ఇటు ఫ్యాన్స్ సైతం షాకయ్యారు.

మొదటిసారిగా తేజ్ సరికొత్త లుక్‌లో కనిపిస్తున్నాడని.. దీంతో ఈసారి బాక్సాఫీస్ షేక్ చేయడం ఖాయమంటున్నారు. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమాలో హీరోయిన్‌గా ఐశ్వర్య లక్ష్మి(Aishwarya Lakshmi) నటిస్తోంది. అయితే ప్రైమ్ షో ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్స్‌పై చైతన్య రెడ్డి(chaitanya Reddy), నిరంజన్ రెడ్డి(Niranjan Reddy) సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

ఇదిలా ఉంటే.. నేడు హనుమాన్ జయంతి సందర్భంగా ఈ మూవీ నుంచి మెగా హీరో సాయి ధరమ్ తేజ్ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. అందులో మీకు మీ కుటుంబ సభ్యులకు హనుమాన్ జయంతి శుభాకాంక్షలు అని తెలుపుతూ పోస్టర్ విడుదల చేశారు. ఇక అందులో ధరమ్ తేజ్ సేమ్ ఆంజనేయ స్వామి లాగే ఉన్నాడు. బ్యాక్ నుంచి కనిపిస్తున్న ఈ పోస్టర్‌లో అతను బాణం పట్టుకున్నాడు. అలాగే మొత్తం అతని ముందు మంటలు అంటుకుంటున్నాయి. ప్రస్తుతం ఈ పోస్టర్ సినిమాపై మరింత క్యూరియాసిటీని పెంచేశాయి.


Next Story

Most Viewed