హగ్ చేసుకున్న ఫొటో షేర్ చేస్తూ లవ్ యూ మై బేబీ అంటూ రామ్ చరణ్ హీరోయిన్ పోస్ట్.. షాక్‌లో నెటిజన్లు!

by Hamsa |
హగ్ చేసుకున్న ఫొటో షేర్ చేస్తూ లవ్ యూ మై బేబీ అంటూ రామ్ చరణ్ హీరోయిన్ పోస్ట్.. షాక్‌లో నెటిజన్లు!
X

దిశ, సినిమా: టాలీవుడ్ హీరోయిన్ అంజలి(Anjali) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ అమ్మడు ‘ఫొటో’ మూవీతో వచ్చి ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ (Seethamma Vakitlo Sirimalle Chettu)తో ఫుల్ పాపులారిటీ తెచ్చుకుంది. దీంతో ఆమెకు వరుస అవకాశాలు వచ్చాయి. దీంతో టాలీవుడ్ స్టార్స్ బాలకృష్ణ(Balakrishna), వెంకటేష్, మహేష్ బాబు, రవితేజ, రామ్ చరణ్(Ram Charan), పవన్ కళ్యాణ్ వంటి వారితో నటించి అనతి కాలంలోనే స్టార్ బ్యూటీగా మారిపోయింది. గత ఏడాది ‘గ్యాంగ్ ఆఫ్ గోదావరి’ సినిమాతో హిట్ అందుకుంది. ఇక ఇటీవల వచ్చిన ‘గేమ్ చేంజర్’ మెప్పించలేకపోయింది. అయితే అంజలి, విశాల్ నటించిన ‘మదగజరాజా’ 12 ఏళ్ల తర్వాత థియేటర్స్‌లోకి వచ్చినప్పటికీ ఊహించని విధంగా హిట్ సాధించింది. అలాగే ఈ సినిమా భారీ కలెక్షన్లు రాబట్టడంతో పాటు అందరినీ ఆకట్టుకుంది. దీంతో అంజలి తన సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తోంది. ప్రస్తుతం ఈ అమ్మడు ఏ ప్రాజెక్టు చేయడం లేదు. దీంతో సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ పలు ఫొటోలు షేర్ చేస్తోంది. తాజాగా, ఆ భామ తన పెట్‌పై పెట్టిన పోస్ట్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. పెట్ డే కావడంతో తన డాగ్‌కు గట్టిగా హగ్ చేసుకున్న ఫొటో షేర్ చేస్తూ లవ్‌ యూ మై బేబీ అనే క్యాప్షన్ జత చేసింది. ఇక ఇందులో ఆమె మేకప్ లేకుండా కనిపించడంతో ఇలా ఉందేంటని నెటిజన్లు షాక్ అవుతున్నారు. అయితే అది రీసెంట్ పిక్ కాదని తెలుస్తోంది.



Next Story

Most Viewed