నీట్ అంశంపై పార్లమెంట్‌లో చర్చించాలని ప్రధాని మోడీకి రాహుల్ లేఖ

by Mahesh |
నీట్ అంశంపై పార్లమెంట్‌లో చర్చించాలని ప్రధాని మోడీకి రాహుల్ లేఖ
X

దిశ, వెబ్ డెస్క్: నీట్ 2024 యూజీ పరీక్షల్లో అవకతవకలు జరిగాయని దేశ వ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నీట్ ఇష్యూపై రేపు పార్లమెంట్ లో చర్చ జరపాలని కోరుతూ కాంగ్రెస్ ఎంపీ, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశారు. ఆ లేఖలో " 24 లక్షల మంది నీట్ ఔత్సాహికుల ప్రయోజనాల కోసం నిర్మాణాత్మకంగా పాల్గొనడమే మా లక్ష్యం. ఈ చర్చకు మీరు నాయకత్వం వహిస్తే అది సముచితంగా ఉంటుందని నేను నమ్ముతున్నాను" అని రాహుల్ తన లేఖలో పేర్కొన్నారు. కాగా ఈ రోజు సభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలుపుతు ప్రధాని మోడీ మాట్లాడుతుండగా ప్రతిపక్ష నాయకులు అడుగడుగునా అడ్డుతగిలారు. దీంతో అధికార, ప్రతిపక్ష సభ్యుల నినాదాలతో సభ దద్దరిల్లిపోయింది.

Next Story

Most Viewed