హత్రాస్ తొక్కిసలాటపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం యోగీ

by Mahesh |
హత్రాస్ తొక్కిసలాటపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం యోగీ
X

దిశ, వెబ్ డెస్క్: మంగళవారం మధ్యాహ్న సమయంలో ఉత్తర ప్రదేశ్‌లోని హత్రాస్ జిల్లాలో ఓ ఆధ్యాత్మిక కార్యక్రమంలో తొక్కిసలాట జరిగింది. ఈ ప్రమాదంలో 27 మంది ప్రాణాలు కోల్పోగా వంద మంది గాయాలపాలయ్యారు. ఈ ఘటనపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ స్పందించారు. హత్రాస్ జిల్లాలో జరిగిన దురదృష్టకర ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడం చాలా బాధాకరం అంటూ.. మృతుల కుటుంబ సభ్యులకు సీఎం సానుభూతి తెలిపారు. అలాగే యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టి క్షతగాత్రులకు సరైన చికిత్స అందించాలని అధికారులకు సూచించారు. శ్రీరాముని పాదాల చెంత మరణించిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నానని సీఎం యోగి తన ట్విట్టర్ లో రాసుకొచ్చారు. కాగా ఈ ప్రమాదంతో మొత్తం 23 మంది మహిళలు నలుగురు పిల్లలు చనిపోయినట్లు తెలుస్తోంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని స్థానిక అధికారులు జాతీయ మీడియాతో తెలిపారు.

Next Story