బీరులో గుర్తు తెలియని అవశేషాలు

by Sridhar Babu |
బీరులో గుర్తు తెలియని అవశేషాలు
X

దిశ, చార్మినార్​ : పాతబస్తీ ఫలక్​నుమాలోని కోహినూర్​ బార్​లో కింగ్​ ఫిషర్​ బీర్​లో గర్తు తెలియని అవశేషాలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. కింగ్​ ఫిషర్​ బీర్​లో బల్లి అవశేషాలు అంటూ సోషల్​మీడియాలో వీడియోలు తెగ వైరల్​ అవుతున్నాయి. వివరాల లోకి వెళితే... పాతబస్తీ ఫలక్​నుమాకు చెందిన కోహినూర్​ బార్​లో జనతాకు వేరుగా ఉన్న కౌంటర్​ వద్ద ఓ వ్యక్తి కింగ్​ ఫిషర్​ బీరును కొనుగోలు చేశాడు. బీరు తీసుకుని స్నాక్స్​ కు ఆర్డర్​ చేసి టేబుల్​ వద్దకు వచ్చి కూర్చున్నాడు. తీరా బీర్​ వైపు చూడగా అందులో గుర్తు తెలియని పీచు లాంటి పదార్థం మాదిరిగా ముక్కలు

ముక్కలుగా తేలుతూ కనిపించడంతో మందు బాబు షాక్​కు గురయ్యాడు. ఇదేంటి అని బార్​ కౌంటర్​ వద్దకు వెళ్లి మందుబాబు అడగగా అప్పుడప్పుడు ఇలాంటివి వస్తుంటాయని బార్​ కౌంటర్​లో ఉన్న వ్యక్తి తాపీగా సమాధానమిస్తున్న వీడియోలు కూడా వైరల్​గా మారాయి. ఈ వీడియోలను గమనించిన చార్మినార్​ ఎక్సైజ్​ అధికారులు వెంటనే ఒక టీంను కోహినూర్​ బార్​కు పంపించారు. ఆ బీరు బాటిల్​పై మ్యాన్​ ఫ్యాక్షరింగ్​ డేట్​ జూన్​ 24 గా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఆ బీరులో ఉన్నది బల్లి అవశేషాలా? ఇతర పీచు పదార్థాలా? అది ఒరిజినల్​ బీరా? కల్తీ బీరా ? అన్నది పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది. ఇది ఇలా ఉండగా నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తున్న సదరు బార్​ యాజమాన్యంపై చార్మినార్​ ఎక్సైజ్​ పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని మందుబాబులు డిమాండ్​ చేస్తున్నారు.

Next Story

Most Viewed