ఎస్సై మృతదేహంతో రాస్తారోకో.. జాతీయ రహదారిపై నిలిచిపోయిన వాహనాలు

by Aamani |   ( Updated:2024-07-07 09:33:44.0  )
ఎస్సై మృతదేహంతో రాస్తారోకో.. జాతీయ రహదారిపై నిలిచిపోయిన వాహనాలు
X

దిశ,నల్లబెల్లి : జూన్ 30 వ తారీకు ఆత్మహత్య యత్నానికి పాల్పడి హైదరాబాద్ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయిన అశ్వరావుపేట ఎస్సై శ్రీరాముల శ్రీను కుటుంబానికి న్యాయం చేయడంతో పాటు సిఐ జితేందర్ రెడ్డిని సస్పెండ్ చేసి రిమాండ్ చేయాలని కోరుతూ దళిత సంఘాల ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. రాస్తారో పాల్గొన్న నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ ఎస్సై మృతికి ప్రభుత్వం బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి బాధితుడి కుటుంబానికి న్యాయం చేయాలని అన్నారు.

ఎస్సై భార్యకు గ్రూప్ 2 ఉద్యోగం, ఐదు ఎకరాల భూమితో పాటు రాజీవ్ గృహం అందించాలని ఆయన డిమాండ్ చేశారు. ఏసీబీ కిరణ్ కుమార్ న్యాయం చేస్తానని హామీ ఇచ్చినప్పటికీ ప్రభుత్వం నుంచి హామీ వచ్చేవరకు రాస్తారోకో విరమించేది లేదని రాస్తారోకో నిర్వహించారు. రాస్తారోకో కారణంగా జాతీయ రహదారిపై పెద్ద ఎత్తున ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. ఈ కార్యక్రమంలో నల్లబెల్లి మాజీ జడ్పీటీసీ సభ్యురాలు పెద్ది స్వప్న మాజీ ఎంపీపీలు శ్రీనివాస్ గౌడ్, బానోతు సారంగపాణి దళిత సంఘాల నాయకులు, గ్రామస్తులు, కుటుంబ సభ్యులు, రజాతన పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed