కప్పట్రాళ్ల హత్య కేసులో కోర్టు సంచలన సంచలన తీర్పు.. 17 మందికి విముక్తి

by srinivas |
కప్పట్రాళ్ల హత్య కేసులో కోర్టు సంచలన సంచలన తీర్పు.. 17 మందికి విముక్తి
X

దిశ, వెబ్ డెస్క్: కప్పట్రాళ్ల వెంకటప్పయ్య నాయుడు హత్య కేసులో హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఈ కేసులో దోషులుగా ఉన్న 17 మందిని నిర్దోషులగా తేల్చింది. వీరిపై ఆదోని కోర్టు విధించిన జీవితఖైదును కొట్టివేసింది. ఫ్యాక్షన్ నేపథ్యంలో కర్నూలు జిల్లా దేవనకొండ మండలం కప్పట్రాళ్లలో 11 మందిని దుండగులు హత్య చేశారు. గ్రామానికి చెందిన వెంకటప్పనాయుడు, మాధాపురం మద్దిలేటి నాయుడు మధ్య 1995 నుంచి ఫ్యాక్షన్ గొడవలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో 2008 మే 17న కప్పట్రాళ్ల వెంకటప్పనాయుడుతో పాటు 11 మంది దారుణ హత్యకు గురయ్యారు. దేవనకొండ మండలం బోదెపాడు వద్ద వీరిని లారీతో ఢీకొట్టి చంపేశారు.

అయితే 42 మందిపై అప్పట్లో పోలీసులు కేసు నమోదు చేశారు. 21 మందికి 2014 డిసెంబర్ 10న ఆదోని కోర్టు జీవిత ఖైదు విధించింది. అయితే వీరిలో నలుగురు అనారోగ్యంతో చనిపోయారు. ఈ తీర్పును సవాల్ చేస్తూ హైకోర్టులో నిందితులు పటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై పలుమార్లు విచారణ చేపట్టిన ధర్మాసనం తాజాగా తుది తీర్పు వెల్లడించింది.

Advertisement

Next Story

Most Viewed