విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి : కలెక్టర్

by Aamani |
విద్యార్థులకు నాణ్యమైన  భోజనం అందించాలి : కలెక్టర్
X

దిశ, జనగామ: క్షేత్రస్థాయి పర్యటన లో భాగంగా మంగళవారం చిల్పూర్ మండలం లో రిజ్వాన్ భాషా షేక్ జడ్పీ హెచ్ ఎస్ పాఠశాలను ఆకస్మికంగా సందర్శించి విద్యార్థులతో మాట్లాడారు. పదో తరగతి విద్యార్థుల మేధాశక్తిని పరిశీలించారు. పాఠశాలలో విద్యార్థులకు ప్రభుత్వం కల్పిస్తున్న వసతుల కల్పనను అడిగి తెలుసుకున్నారు.అనంతరం విద్యార్థులతో మాట్లాడుతూ పదవ తరగతిలో ఉత్తమ ఫలితాలను సాధించాలని, 10/10 సాధించి పాఠశాలకు గుర్తింపు తో పాటు తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలన్నారు. అదే గ్రామంలోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాన్ని కలెక్టర్ సందర్శించి బాలికలతో మాట్లాడారు. విద్యార్థినులతో కలిసి భోజనం చేశారు.

విద్యార్థులకు ఉన్నతమైన విద్యతో పాటు నాణ్యమైన భోజనం అందించాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. అనంతరం జిల్లా వైద్య శాఖ అధికారితో కలిసి మల్కాపూర్ పీహెచ్ సి ను తనిఖీ చేసి వైద్య సేవల నిర్వహణ పనితీరును అడిగి తెలుసుకున్నారు. ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రంలో వైద్య సిబ్బందితో సమావేశం ఏర్పాటు చేసి సీజనల్ వ్యాధులపై ఎల్లవేళలా అప్రమత్తంగా ఉండాలని, నిరంతరం పారిశుద్ధ్యం మెరుగు పరిచేందుకు చర్యలు తీసుకోవాలని, అంటువ్యాధులు ప్రబలకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని డాక్టర్లకు సూచించారు. సీజనల్ వ్యాధుల గురించి, వాటి నిర్ములనకు చేపట్టవలసిన అంశాలను వివరించి చెప్పారు .మలేరియా, డెంగ్యూ వ్యాధులు గతం లో నమోదు అయిన గ్రామాల వివరాలను తెలుసుకొని ముందస్తు చర్యలను తీసుకోవాలన్నారు.

ప్రభుత్వ ఆసుపత్రులను పేద ప్రజలు సద్వినియోగం చేసుకునేలా వైద్య సిబ్బంది కృషి చేయాలన్నారు.ప్రజలు ఎక్కువగా ఈ సీజన్ లో కుక్క, పాము కాటుకు గురి అవుతారని, ప్రజలకు అవగాహన కల్పించి,సత్వరమే వైద్యం అందేలా మందులు అందుబాటులో ఉంచుకోవాలన్నారు. ప్రతీ ఆశ, ఏఎన్ఎం లతో మల్కాపూర్ గ్రామంలోని గర్భిణీ లకు కలెక్టర్ ఫోన్ చేపించి వారికి అందుతున్న వైద్యం గురించి అడిగి తెలుసుకున్నారు. దీర్ఘకాలీక బాధితుల వారికి అందిస్తున్న వైద్య సదుపాయలను కలెక్టర్ డి హెమ్ హెచ్ ఓ ను అడిగి తెలుసుకున్నారు. చిన్న పెండ్యాల లోని అమ్మ ఆదర్శ పాఠశాల అభివృద్ధి పనులను అడిగి తెలుసుకున్నారు. పనులను చేపట్టి పూర్తి చేయాలని ఆదేశించారు.ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య శాఖ అధికారి తో పాటు విద్య, ఇంజనీరింగ్, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ వారు పాల్గొన్నారు.

Next Story

Most Viewed