గుడ్ న్యూస్ చెప్పిన బిగ్ బాస్ ఫేమ్ మానస్

by Prasanna |
గుడ్ న్యూస్ చెప్పిన బిగ్ బాస్ ఫేమ్ మానస్
X

దిశ, సినిమా: బిగ్ బాస్ ఫేమ్ మానస్ నాగుల పల్లి మనందరికి సుపరిచితమే. 2023 నవంబర్ లో మానస్ పెళ్లి చేసుకుని ఓ ఇంటివాడయ్యాడు. మానస్, శ్రీజల మ్యారేజ్ పెద్దల సమక్షంలో ఘనంగా జరిగింది. వీరిది పెద్దలు కుదిర్చిన వివాహం. ఆమెను పెళ్లి చేసుకున్న తర్వాత నుంచి కెరీర్లో మానస్ దూసుకెళ్తున్నాడు. స్టార్ మా లో ప్రసారమయ్యే బ్రహ్మముడి సీరియల్ టాప్ టిఆర్పీ తో మంచి రేటింగ్ అందుకుంది.

అయితే, తాజాగా మానస్ అందరికి గొప్ప శుభవార్తను చెప్పాడు. త్వరలో తండ్రి కాబోతున్నట్లు ప్రకటించాడు. ఈ శుభవార్తను మానస్ సోషల్ మీడియా వేదిక ద్వారా అందరితో పంచుకున్నాడు. ఇదే క్రమంలో గర్భవతి అయిన తన భార్య బేబీ బంప్ కూడా పోస్ట్ చేసాడు.

మా పెద్దలు కుదిర్చిన పెళ్లి అయినప్పటికీ మా ఆలోచనలు సరిగ్గా సరిపోతాయి. ఇప్పుడు, మా కుటుంబానికి బేబీ రావడం చాలా సంతోషంగా ఉంది. "బేబీ నాగుల పల్లి వస్తోంది" అని మానస్ సంతోషం వ్యక్తం చేశాడు. ఇప్పుడు, ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. పలువురు టీవీ తారలు, అభిమానులు, నెటిజన్లు, మానస్- శ్రీజ జంటకు కంగ్రాట్స్ చెబుతున్నారు.

Next Story

Most Viewed