లగ్జరీ కార్లు, ఖరీదైనా ఫొటోలు.. భోలే బాబా భవనం చూస్తే ఆశ్చరపోవాల్సిందే

by Shamantha N |
లగ్జరీ కార్లు, ఖరీదైనా ఫొటోలు.. భోలే బాబా భవనం చూస్తే ఆశ్చరపోవాల్సిందే
X

దిశ, నేషనల్ బ్యూరో: హత్రాస్‌ తొక్కసలాట తర్వాత నారాయణ హరి సాకర్ అలియాస్ భోలే బాబాపై శనివారం తొలి కేసు నమోదైంది. కాగా.. భోలే బాబాకు సంబంధించిన ఆసక్తికర విషయాలు బయటకొస్తున్నాయి. 2019కి ముందు లఖింపూర్ ఖేరీలో భోలే బాబా అజ్ఞాతంలో ఉన్నట్లు తెలుస్తోంది. కాగా.. అజ్ఞాతంలో ఉన్నప్పుడు ఉన్న విలాసవంతంమైన భవనం చర్చకు వచ్చింది. ఆ బిల్డింగ్ లో లగ్జరీ కార్లు, ఫొటోలు కన్పించాయి. ఆ భవనంలోనే భోలే బాబా మూడు నాలుగు సార్లు ఉన్నట్లు యజమాని గోవింద్ పుర్వార్ తెలిపారు. చివరిసారిగా 2019లో 15 రోజులపాటు ఉన్నట్లు వెల్లడించారు.

విశాలమైన పార్కింగ్

సాగు భూములు, తోటల మధ్య ఈ బిల్డింగ్ ఉంది. అందులోనే విశాలమైన పార్కింగ్ ఉంది. భోలే బాబాకు చెందిన రెండు లగ్జరీ కార్లు ఇంకా అక్కడే ఉన్నాయి. వంట చేసుకునేందుకు వీలుగా కిచన్ సామగ్రి ఉంది. వంటగది పక్కనే గుహలాంటి గది ఉంది. ఇందులో భోలే బాబా సత్సంగ్‌ పోటోలు ఉ‍న్నాయి. మరో గదిలో 2019 నాటి భోలే బాబా సత్సంగ్ ఫొటోలు, ఆయన భక్తులతో ఎప్పుడు సమావేశమవుతారో టైమింగ్స్ కూడా ఉన్నాయి. చేతితో రాసిన హారతి చాలీసా ఉంది. అయితే, ఆ బిల్డింగ్ లో బాబా విశ్రాంతి తీసుకునే వారని స్థానికులు తెలిపారు. ఇకపోతే హత్రాస్ తొక్కిసలాట తర్వాత శనివారం తొలిసారిగా మీడియా ముందుకొచ్చి భోలే బాబా మాట్లాడారు. ప్రభుత్వం, పాలనా యంత్రాంగంపై నమ్మకం ఉంచాలని బాధితులను కోరారు.

Advertisement

Next Story

Most Viewed