బీఎస్సీ నర్సింగ్ నోటిఫికేషన్ రిలీజ్

by Mahesh |
బీఎస్సీ నర్సింగ్ నోటిఫికేషన్ రిలీజ్
X

దిశ, తెలంగాణ బ్యూరో: బీఎస్సీ నర్సింగ్ 2024–25 సీట్ల అడ్మిషన్ల ప్రాసెస్ మొదలైంది. ఈ మేరకు కాళోజీ హెల్త్ యూనివర్సిటీ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ నెల 6 నుంచి 14 సాయంత్రం 6 గంటల వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. అయితే ఈ ఏపీసెట్–2024 క్వాలిఫై అయినోళ్లు మాత్రమే అర్హులుగా వర్సిటీ పేర్కొన్నది. ప్రభుత్వ, ప్రైవేటు నర్సింగ్ కాలేజీలన్నింటికీ ఇదే రూల్ వర్తిస్తుందని స్పష్టం చేసింది. వెబ్ బేస్డ్ కౌన్సిలింగ్ నిర్వహించి, మెరిట్ లిస్ట్ రిలీజ్ చేస్తామని వెల్లడించింది. మరిన్ని వివరాలకు యూనివర్సిటీ వెబ్‌సైట్‌ను సందర్శించాలని అధికారులు శనివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed