మొదటి పీరియడ్ గురించి పిల్లలకు ఏ వయసులో చెప్పాలంటే?

by Jakkula Samataha |
మొదటి పీరియడ్ గురించి పిల్లలకు ఏ వయసులో చెప్పాలంటే?
X

దిశ, ఫీచర్స్ : పీరియడ్స్ దీని గురించి మాట్లాడటానికి కూడా చాలా మంది ఇష్టపడరు. ఇక ఈ పదం వింటేనే కొంత మంది అబ్బాయిలు చులకనగా చూస్తారు. కానీ ప్రతి ఆడపిల్ల జీవితంలో ప్రతి నెలా నిరంతరం సాగే ప్రక్రియ ఇది. అమ్మాయిలకు ఇదో పెద్ద సమస్య అనే చెప్పవచ్చు. ప్రతి ఆడపిల్లలకు పీరియడ్స్ వస్తాయి, ఇది ఐదు రోజుల పాటు ఉంటుంది. దీంతో వారు మానసికంగా , శారీరకంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటారు. అందుకే ఆడపిల్ల ఉన్న ప్రతి తల్లి తన కూతురుకు పీరియడ్స్ వచ్చే ఏజ్ వచ్చింది అన్నప్పటి నుంచే వారు ఎన్నో విధాలుగా సతమతం అవుతుంటారు.

మొదటి పీరియడ్ తన కూతురు ఎలా ఎదుర్కొంటుంది. భయాందోళనకు గురి అవుతుందేమో? మానసికంగా, శారీరకంగా తనను బలంగా ఎలా చేయాలి అని పలు విధాలుగా ఆలోచిస్తుంటారు. కాగా, ఇప్పుడు మొదటి పీరియడ్ గురించి ఆడపిల్లలకు ఏ వయసులో చెప్పాలో ఇప్పుడు తెలుసుకుందాం.

ఒకప్పుడు 13 ,14 వయసులో రజస్వల అయ్యేది. కానీ ఇప్పుడు తీసుకుంటున్న ఆహారం జీవనశైలి కారణంగా 9 నుంచి 13 సంవత్సరాల మధ్యనే ఆడపిల్లలకు మొదటి పీరియడ్ వస్తుంది. అందుకే ప్రతి తల్లి తన కూతురుకు మొదటి పీరియడ్ గురించి ఒక వయసు వచ్చాక చెప్పాలి. అది ఎప్పుడంటే? ఎనిమిది ఏళ్ల వయసు రాగానే ఆడపిల్లల శరీరంలో కొన్ని మార్పులు వస్తుంటాయి. అందువలన ఆ ఏజ్ లోనే తల్లి తన కూతురుకు మొదటి పీరియడ్, వజైనల్ డిశ్చార్జ్, ఛాతి వద్ద మార్పుల గురించి వివరంగా చెప్పాలంట.

ముఖ్యంగా తన తల్లి కూతురితో చాలా ఫ్రీగా ఉంటూ, ఫ్రెడ్లీగా మాట్లాడాలి. ఆ సమయంలోనే పీరియడ్స్ గురించి వివరంగా చెప్పాలి. బ్లీడింగ్ అవుతుందని, దానిని చూసి భయపడకూడదు, డ్రెసింగ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పాలంట. ఇదే కాకుండా పీరియడ్ ప్రతి నెల వస్తుంది, ఐదు రోజుల వరకు ఉంటుంది కాబట్టి ప్రతి నెల ఈ విషయం పట్ల మానసికంగా కుంగిపోకూడదు, నీకు సౌకర్యంగా అనిపించే ప్యాడ్స్ వాడాలి, శరీరాన్ని శుభ్రంగా ఉంచుకోవాలని.. ఆమెకు మొదటి పీరియడ్ గురించి వివరంగా చెప్పాలి. దాని వలన వారు రజస్వల అయినా మానసికంగా ధృఢంగా ఉంటారు.

నోట్ : పై వార్తను దిశ ధృవీకరించడం లేదు. ఇంటర్ నెట్‌లో లభించిన సమాచారం ఆధారం, వివిధ నిపుణులు, వైద్యులు పేర్కొన్న సూచనల మేరకు మాత్రమే ఇవ్వబడింది.

Advertisement

Next Story

Most Viewed