- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Sesame Seeds: నువ్వులు తినడం వలన మన ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలు ఇవే
దిశ, వెబ్ డెస్క్ : మనలో చాలా మంది నువ్వులను (Sesame Seeds)ఇష్టంగా తింటారు. కొందరైతే నువ్వులు, బెల్లంతో చేసిన లడ్డూలను అదే పని తింటూ ఉంటారు. ఇవి చలికాలంలో సూపర్ ఫుడ్. ఎందుకంటే, ఇవి తినడానికి ఎంత రుచిగా ఉంటాయో అలాగే ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి. వీటిలో ప్రొటీన్లు, విటమిన్లు, ఒమేగా 6 వంటి పోషకాలు ఉంటాయి. అంతేకాకుండా, ఐరన్, మెగ్నీషియం కూడా ఉంటాయి. ఇవి ఎక్కువ వేడిని కలిగి ఉంటాయి. కాబట్టి, శీతాకాలంలో వీటిని తీసుకుంటే శరీరం వేడిగా ఉంటుంది.
నువ్వులు రోజూ తినడం వలన మన శరీరానికి కావాల్సిన ఖనిజాలు అందుతాయి. హైపర్‌టెన్షన్‌తో ఇబ్బంది పడేవారికి నువ్వులు ఎంతగానో ఉపయోగపడతాయి. అలాగే, కాల్షియం ఉండటం వల్ల ఎముకలు బలంగా అయ్యేలా చేస్తాయి.
నువ్వులలో మెగ్నీషియం, మాంగనీస్, కాల్షియం, జింక్ ఉంటుంది. ఎముకలు దృఢంగా ఉండేందుకు ఇవి చాలా అవసరం. అంతేకాకుండా, ఇవి కడుపులో మంటను తొలగిస్తాయి. వీటిని తినడం వలన కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం పొందుతారు. అలాగే వీటిలో ఉండే ఫైబర్ జీర్ణక్రియను సులభతరం చేస్తుంది. దీన్ని తీసుకోవడం వల్ల మలబద్ధకం, అజీర్ణం వంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.
గమనిక: ఇక్కడ అందించిన సమాచారం పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి తీసుకోబడింది. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే. ‘దిశ’ ఈ విషయాలను ధృవీకరించడం లేదు.