మానవ అక్రమ రవాణా.. దేశవ్యాప్తంగా NIA సోదాలు

by Rani Yarlagadda |
మానవ అక్రమ రవాణా.. దేశవ్యాప్తంగా NIA సోదాలు
X

దిశ, వెబ్ డెస్క్: దేశ వ్యాప్తంగా ఎన్ఐఏ (NIA) సోదాలు నిర్వహిస్తోంది. మానవ అక్రమ రవాణా జరుగుతుందని వచ్చిన సమాచారంతో.. వివిధ ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. 6 రాష్ట్రాల్లోని 22 ప్రాంతాల్లో సోదాలు కొనసాగుతున్నాయి. సైబర్‌ మోసాలకు పాల్పడుతున్న యువతను కాల్‌ సెంటర్లలో పనిచేసేలా ప్రలోభపెట్టిన హ్యూమన్‌ ట్రాఫికింగ్‌ సిండికేట్‌ (Human Trafficking Syndicate)పై ఎన్ఐఏ దర్యాప్తు చేస్తోంది. అందులో భాగంగానే ఈ సోదాలు చేపట్టింది. బీహార్, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ ఇతర ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. బీహార్‌లోని గోపాల్‌గంజ్‌లో పోలీసులు కేసు నమోదు చేశారు.

ఉద్యోగాల సాకుతో భారతీయ యువకులను ఒక వ్యవస్థీకృత సిండికేట్ ప్రలోభపెట్టి విదేశాలకు రవాణా చేయడం, సైబర్ మోసానికి పాల్పడే నకిలీ కాల్ సెంటర్‌లలో పనిచేయమని బలవంతం చేస్తున్నట్లు ఎన్ఐఏ గుర్తించింది. మానవ అక్రమ రవాణా దేశంలో ప్రధాన సమస్యగా మారిన విషయం తెలిసిందే. ఏటా వేలాది మంది ప్రజలు అదృశ్యమవుతున్నారు. వారిలో చాలా మంది అక్రమ రవాణా బాధితులే. ఒక్కసారి మానవ అక్రమ రవాణాలో చిక్కుకుంటే అందులో నుంచి బయటికి రావడం అంత ఈజీ కాదు.

Advertisement

Next Story