Hyderabad Metro : రేపటి నుంచి హైదరాబాద్ మెట్రో సంక్రాంతి ఉత్సవాలు

by M.Rajitha |   ( Updated:2025-01-07 14:30:56.0  )
Hyderabad Metro : రేపటి నుంచి హైదరాబాద్ మెట్రో సంక్రాంతి ఉత్సవాలు
X

దిశ, వెబ్ డెస్క్ : సంక్రాంతి పండుగ ఉత్సవాలను(Sankranthi celebrations) ఘనంగా నిర్వహించేందుకు హైదరాబాద్‌ మెట్రో(Hyderabad Metro) సన్నాహాలు చేస్తోంది. రేపటి నుంచి మూడు రోజుల పాటు "మి టైం ఆన్‌ మై మెట్రో"(Me Time On My Metro) క్యాంపెన్‌ పేరిట వేడుకలను నిర్వహిస్తున్నది. పండుగ సంబరాలను రేపు ఉదయం 11 గంటలకు ఎంజీబీఎస్‌ మెట్రోస్టేషన్‌(MGBS Metro Station)లో ప్రారంభించనున్నారు. వేడుకల్లో భాగంగా తెలుగుదనం ఉట్టిపడేలా సాంస్కృతిక కార్యక్రమాలు, సాంప్రదాయాలను ప్రతిబింబించేలా కార్యక్రమాలు, తెలుగు ఔన్నత్యాన్ని చాటేలా వేడుకలను నిర్వహించేందుకు ఎల్‌అండ్‌టీ(L&T) ఏర్పాట్లు చేసింది. నగరంలోని పలు స్టేషన్ల పరిధిలో ఈ వేడుకలను ఉండేలా ఏర్పాటు చేయనున్నారు.

Next Story

Most Viewed