- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
TTD:తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలు స్వీకరణ.. తొలి రోజు ఎన్ని వచ్చాయంటే?

దిశ,వెబ్‌డెస్క్: తిరుమల(Tirumala) శ్రీవేకంటేశ్వర స్వామి వారి దర్శనానికి తెలంగాణ(Telangana) ప్రజా ప్రతినిధుల సిఫార్సులను అనుమతించాలని ఏపీ ప్రభుత్వం(AP Government) టీటీడీ(TTD)కి ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో టీటీడీ ఆ సిఫార్సు లేఖలను తీసుకోవాలని నిర్ణయించుకుంది. ఈ తరుణంలో ముందుగా ప్రకటించిన విధంగానే.. మార్చి 23వ తేదీన తెలంగాణ ప్రజా ప్రతినిధుల నుంచి సిఫార్సు లేఖల స్వీకరణ ప్రారంభించింది.
ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రజా ప్రతినిధుల సిఫార్సు లేఖల ద్వారా మార్చి 24వ తేదీన స్వామివారిని దర్శించుకోవాలని అనుకునే వారు.. ఒక రోజు ముందుగా సిఫార్స్ లేఖలు పంపాలని టీటీడీ అధికారులు సూచించారు. ఈ క్రమంలో తొలి రోజే(ఆదివారం) పెద్ద ఎత్తున 90 మంది ప్రజా ప్రతినిధులు సిఫార్సు లేఖలను జారీ చేశారు. ఈ సిఫార్సు లేఖలను అదనపు ఈవో కార్యాలయం అధికారులు స్వీకరించారు. వీరికి ఇవాళ(సోమవారం) వీఐపీ బ్రేక్ దర్శనం కల్పించనున్నారు.