- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
‘సంతాన ప్రాప్తిరస్తు’మూవీ ఫస్ట్ సింగిల్ విడుదల.. రొమాంటిక్ పోస్టర్‌తో మెస్మరైజ్ చేసిన మూవీ మేకర్స్

దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ హీరోయిన్ చాందిని చౌదరి(Chandni Chowdhury) నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘సంతాన ప్రాప్తిరస్తు’(SanthanaPrapthirasthu). విక్రాంత్(Vikrant) ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రానికి సంజీవ్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. అయితే మధుర ఎంటర్‌టైన్‌మెంట్స్, నిర్వి ఆర్ట్స్ బ్యానర్స్‌పై మధుర శ్రీధర్ రెడ్డి(Sreedhar Reddy), నిర్వి హరిప్రసాద్ రెడ్డి నిర్మిస్తున్నారు. సునీల్ కశ్యప్ సంగీతం అందిస్తున్నారు. ఇక ఇందులో స్టార్ కమెడియన్ వెన్నెల కిషోర్, జీవన్ కుమాన్, తరుణ్ భాస్కర్, తాగుబోతు రమేష్, అభినవ్ గోమతం వంటి నటులు కనిపించనున్నారు. ప్రస్తుతం సంతాన ప్రాప్తి రస్తు షూటింగ్ జరుపుకుంటోంది.
దీంతో మూవీ మేకర్స్ వరుస అప్డేట్స్ విడుదల చేస్తూ ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని పెంచుతున్నారు. విభిన్న కథతో రాబోతున్న ఈ సినిమా నుంచి వచ్చే ప్రతి అప్డేట్ ప్రేక్షకులతో పాటు, ప్రేమ జంటలకు మంత్రముగ్దులను చేస్తూ కనెక్ట్ అవుతున్నాయి. ఇప్పటికే ‘సంతాన ప్రాప్తి రస్తు’నుంచి వచ్చిన పోస్టర్స్ మంచి రెస్పాన్స్‌ను దక్కించుకున్నాయి. తాజాగా, చిత్రబృందం ఈ సినిమా నుంచి మొదటి పాటను విడుదల చేశారు. ‘‘నాలో.. ఏదో ’’అని సాగే పాటతో పాటు రొమాంటిక్ పోస్టర్‌ను షేర్ చేశారు. ఇందులో చాందిని హీరో చెంప గిల్లుతూ కనిపించగా.. బెడ్‌పై హీరో,హీరోయిన్ సరసాలు ఆడుతున్నట్లుగా ఉన్నారు. ప్రస్తుతం ఈ పోస్టర్ అందరినీ ఫిదా చేస్తోంది.
“కనులే చెబితే, మనసే వినదా” 🧡🎶#SanthanaPrapthirasthu first single #NaaloEdho out now 💕✨🤩
— BA Raju's Team (@baraju_SuperHit) March 26, 2025
~ https://t.co/lI5MAuME6J pic.twitter.com/64oWWoi8pM