IPL2025: టాస్ గెలిచిన సన్ రైజర్స్ హైదరాబాద్

by Gantepaka Srikanth |
IPL2025: టాస్ గెలిచిన సన్ రైజర్స్ హైదరాబాద్
X

దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ 2025(IPL2025)లో భాగంగా కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ మైదానం వేదికగా సన్ రైజర్స్ హైదరాబాద్(Sunrisers Hyderabad), కోల్‌కతా నైట్ రైడర్స్(Kolkata Knight Riders) జట్ల మధ్య రాత్రి 7:30 గంటలకు మ్యాచ్ జరుగనుంది. పాయింట్స్ టేబుల్‌లో ప్రస్తుతం రెండు జట్లు సమాన స్థాయిలో ఉన్నాయి. ఇప్పటివరకు ఈ రెండు జట్లు మూడు మ్యాచులు ఆడగా.. చెరో మ్యాచ్ గెలిచి, రెండు ఓటమి చెందారు. దీంతో ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి తీరాలని రెండు జట్లు కసిమీద ఉన్నాయి. టాస్ గెలిచిన హైదరాబాద్ బౌలింగ్ ఎంచుకున్నది. దీంతో ముందుగా కేకేఆర్ జట్టు బ్యాటింగ్ చేయనున్నది.

SRH జట్టు : అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్, నితీష్ కుమార్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్ (వికెట్ కీపర్), అనికేత్ వర్మ, అభినవ్ మనోహర్, పాట్ కమిన్స్(కెప్టెన్), హర్షల్ పటేల్, మహమ్మద్ షమీ, రాహుల్ చాహర్/జీషన్ అన్సారీ, ఆడమ్ జంపా

KKR జట్టు : సునీల్ నరైన్, క్వింటన్ డి కాక్ (వికెట్ కీపర్), అజింక్యా రహానే(కెప్టెన్), అంగ్క్రిష్ రఘువంశీ, వెంకటేష్ అయ్యర్, రింకు సింగ్, ఆండ్రీ రస్సెల్, రమణదీప్ సింగ్, మొయిన్ అలీ, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి, వైభవ్ అరోరా

Next Story

Most Viewed