- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
నాని ‘ది ప్యారడైజ్’ సినిమాకు కౌంట్‌డౌన్ స్టార్ట్.. కొత్త పోస్టర్ అదిరిపోయిందిగా!

దిశ, సినిమా: నేచురల్ నాని (nani)బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఫుల్ బిజీగా గడుపుతున్నారు. ఇటీవల ‘దసరా’ మూవీతో హిట్ అందుకున్న ఆయన ఫుల్ ఫామ్‌లో దూసుకుపోతున్నారు. ప్రస్తుతం నాని నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ది ప్యారడైజ్’.శ్రీకాంత్ ఓదెల(Srikanth Odela) దర్శకత్వంలో రాబోతున్న ఈ పాన్ ఇండియా సినిమా రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు మేకర్స్. దీనిని సుధాకర్ చెరుకూరి(Sudhakar Cherukuri) నిర్మిస్తుండగా.. ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్(Anirudh Ravichander) సంగీతం అందిస్తున్నారు. అయితే ఇప్పటికే ‘ది ప్యారడైజ్’ నుంచి ఫస్ట్ లుక్ విడుదలై ప్రేక్షకుల్లో అంచనాలను పెంచేసింది.ఈ లుక్‌లో నాని రెండు జడలు ధరించి వెరైటీ అవతారంలో కనిపించడంతో కొంతమంది పలు విమర్శలు కూడా చేశారు. మరికొందరు మాత్రం డిఫ్రరెంట్ కథతో రాబోతున్నాడు.. ఎప్పుడెప్పుడు థియేటర్స్‌లోకి వస్తుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది 2026 మార్చి 26న తెలుగు, తమిళ, మలయాళ, హిందీ, కన్నడ, స్పానిష్ భాషల్లో విడుదల కాబోతుంది. తాజాగా, నాని తన ట్విట్టర్ ద్వారా కౌంట్‌డౌన్ పోస్టర్‌ను షేర్ చేశారు. ఇంకా 365రోజుల్లో థియేటర్స్‌కి రాబోతున్నట్లు క్లారిటీ ఇచ్చారు. ఇక ఈ పోస్టర్‌లో నాని గన్ పట్టుకుని కోపంగా చూస్తూ కనిపించారు.
365 Days/రోజులు.#TheParadise pic.twitter.com/jITmj1Cq9e
— Nani (@NameisNani) March 26, 2025