- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Love Locket: ప్రేమికులు ఇది మీ కోసమే.. ఇక మీ గుండె చప్పుడునూ వినిపించేయండిలా!

దిశ, వెబ్ డెస్క్: ప్రేమ (Love) అనిర్వచనీయమైన గొప్ప అనుభూతి. ఇద్దరు వ్యక్తుల మధ్య ఉండే ఒక బలమైన అనుబంధం. ఇక ప్రేమలో ఉన్న వారి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తమ ప్రేమ గురించి ఎన్నో ఊసులాడుకుంటారు. తమ అభిరుచులకు తగ్గట్లుగా మరెన్నో బహుమతులు ఇచ్చి పుచ్చుకుంటారు. అయితే, ప్రతి ప్రేమికులు.. నాటి నుంచి నేటి వరకు తరచూ చెప్పుకునే మాట 'నా ప్రతి హృదయ స్పందన నీదే'. కానీ, ఆ హృదయ స్పందనను వినేదెలా? ఈ నేపథ్యంలోనే 'ది టచ్ (the Touch)' అనే బ్రాండ్ ప్రేమికుల కోసం స్పెషల్ ఎడిషన్ లవ్ లాకెట్‌ను (Love Locket) రూపొందించింది. దీని సాయంతో ఎప్పుడు కావాలంటే అప్పుడు తమ ప్రేమికులు గుండె చప్పుడును వినొచ్చు. ఇక ఈ స్పెషల్ లవ్ లాకెట్లను నేరుగా ఇద్దరు వాడుకోవచ్చు. ఒకరి వద్దే లాకెట్ ఉంటే, మొబైల్ యాప్‌లో వారి కాంటాక్ట్‌ను సేవ్ చేసుకొని వాడాలి. లాకెట్‌లో ఉండే బటన్‌ను నొక్కినప్పుడు, మీరు ఎంచుకున్న కాంటాక్ట్‌కి మీ గుండె చప్పుడు ఆడియోను చేరవేస్తుంది. సూపర్‌గా ఉంది కదా. ఇక దీని ధర రూ.10 వేల నుంచి ప్రారంభం అవుతుంది. వివిధ రంగుల్లో ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంది.