- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
AP News:ఆన్‌లైన్ బెట్టింగ్‌లపై సీఎం చంద్రబాబు సంచలన నిర్ణయం

దిశ,వెబ్‌డెస్క్: ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్ యాప్(Betting App) కేసులు సంచలనం రేపుతోన్న విషయం తెలిసిందే. బెట్టింగ్‌లకు బానిసై ఎంతో మంది తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఈ యాప్‌లను సినీ నటులు, యూట్యూబర్లు, క్రీడాకారులు ప్రమోట్ చేస్తుండటంతో ఎంతోమంది వీటికి ఆకర్షితులై.. బానిసలుగా మారుతున్నారు. సరదాగా మొదలై ఆ తర్వాత వీటికి బానిసలుగా మారి అప్పుల పాలవుతున్నారు. చివరకు ఆ అప్పులు తీర్చలేక ఎందరో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.
ఇక ఒక్కసారి ఈ బెట్టింగ్ వలలో చిక్కుకున్నారంటే.. ఇక బయట పడటం కష్టమే. అయితే రీసెంట్‌గా బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేసిన పలువురు సెలబ్రిటీలు కేసులు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఈ తరుణంలో ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) సీఎం చంద్రబాబు(CM Chandrababu) సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలో ఆయన మాట్లాడుతూ.. ఆన్‌లైన్ బెట్టింగ్ పై ఉక్కుపాదం మోపుతామని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో బెట్టింగ్‌ల నియంత్రణకు ప్రత్యేక చట్టాం చేయాలని.. మనం తీసుకునే నిర్ణయాలు ఆన్ లైన్ గ్యాంబ్లింగ్ ను పూర్తిగా అరికట్టేలా ఉండాలని సీఎం సూచించారు.
రాష్ట్రంలో ఆర్థిక నేరాలు రోజురోజుకు పెరుగుతున్నాయి అన్నారు. కొందరు వ్యక్తులు డబ్బు(Money) కోసం ఎంతటి నేరానికైన పాల్పడుతున్నారని అన్నారు. ఈ క్రమంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ప్రస్తుతం ఏపీలో గంజాయి సాగు, నేరాలు తగ్గాయని తెలిపారు. ఈ క్రమంలో నేరాలను తగ్గించేందుకు పోలీసులు టెక్నాలజీని వాడుకోవాలని పేర్కొన్నారు. ఈ తరుణంలో నేరాల నియంత్రణకు ప్రజల సహకారం కూడా తీసుకోవాలని సీఎం చంద్రబాబు సూచించారు.