సన్న వడ్ల బోనస్ కు రూ.1100 కోట్లు : మంత్రి శ్రీధర్ బాబు

by Aamani |
సన్న వడ్ల బోనస్ కు రూ.1100 కోట్లు : మంత్రి శ్రీధర్ బాబు
X

దిశ,మంథని : రాష్ట్ర వ్యాప్తంగా రైతులు సంతోషంగా ఉన్నారని, రుణమాఫీ,సన్న వడ్లకు క్వింటాల్ కు రూ.500 బోనస్ అందించడంతోపాటు ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు రైతు భరోసా కింద పెట్టుబడి సహాయాన్ని 12 వేలకు పెంచుతున్నామని తెలిపారు. సన్న వడ్లకు బోనస్ రూపంలో అందించేందుకు తమ ప్రభుత్వం అందించేందుకు రూ.1100 కోట్లు కేటాయించిందని తెలిపారు. ఇందులో రూ.800 కోట్లకు పైగా రైతుల ఖాతాల్లో జమ చేసినట్లు చెప్పారు.మంగళవారం నాడు ఆయన మంథని పట్టణంలో రూ.24 కోట్ల వ్యయంతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు.

ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ప్రజలకు ఇచ్చిన హామీలను ఒకటొకటిగా అమలు చేస్తున్నామని వెల్లడించారు.ప్రతి గ్రామ పంచాయతీలో రైతు రుణమాఫీ, సన్న వడ్లకు బోనస్, పెట్టుబడి సహాయం,రైతులు వివరాలు ప్రతి ఒక్కరికి తెలిసే విధంగా కేబుల్ ఛానల్, సోషల్ మీడియా ద్వారా మీడియా ద్వారా ప్రచారం చేయాలని పార్టీ క్యాడర్ ను కోరారు.అనంతరం మంత్రి ‘ఆలింకో’ సంస్థ నిర్వహించిన క్యాంపులో ఎంపికైన దివ్యాంగులకు ఉపకరణాలను పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో మంథని ఆర్డీవో సురేష్, మున్సిపల్ కమిషనర్ మనోహర్, తహసీల్దార్ రాజయ్య ,ఈఈ సంపత్,ఏ.ఈ.మౌనిక , సంబంధిత అధికారులు, ప్రజా ప్రతినిధులు,తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story