- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
కబ్జాలకు పాల్పడితే చర్యలు తప్పవంటున్న కమిషనర్..
దిశ, అబ్దుల్లాపూర్మెట్ : చెరువులలో కబ్జాలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవని హైడ్రా కమిషనర్ రంగనాథ్ హెచ్చరించారు. బుధవారం ఇబ్రహీంపట్నం నియోజకవర్గం పరిధిలోని పసుమాములలో గల రాయిని చెరువు, తుర్కయంజాల్ పరిధిలోని మాసబ్ చెరువు, ఇంజాపూర్ లోని జిలావర్ఖాన్ చెరువులను పరిశీలించారు. స్థానికంగా పలువురు చేసిన పలు ఫిర్యాదుల మేరకు కమిషనర్ పరిశీలించారు. పసుమాముల పరిధిలోని రాయిని చెరువులో కొంతమంది కట్టలు పోస్తూ చేపలు పెంచుకుంటున్నారని, అదేవిధంగా జీహెచ్ఎంసీ మురుగు అంతా చెరువులో కలుపుతున్నారని వచ్చిన ఫిర్యాదుల మేరకు ఆయన పరిశీలించారు.
రానున్న రోజుల్లో చెరువులు కబ్జా కాకుండా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. అదే విధంగా పసుమాములలో చెరువులో పోసిన మట్టి కుప్పలను తొలగించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో హైడ్రా ఎంక్వయిరీ అధికారి బాచిరెడ్డి, డి.ఎస్.పి పాపయ్య, డీఈ నాగరాజు ఎమ్మార్వో హేమామాలిని, పెద్ద అంబర్పేట మున్సిపల్ కమిషనర్ రవీందర్ రెడ్డి, తూర్కయంజాల్ కమిషనర్ అమరేందర్ రెడ్డి, ఇరిగేషన్ డిఈ చెన్నకేశవరెడ్డి, ఏఈ వంశీధర్ తదితరులు పాల్గొన్నారు.