Gold Rates: వరుసగా మూడో రోజు కూడా పరుగులు పెడుతున్న బంగారం ధరలు.. తులం ఎంతుందంటే..?

by Kavitha |
Gold Rates: వరుసగా మూడో రోజు కూడా పరుగులు పెడుతున్న బంగారం ధరలు.. తులం ఎంతుందంటే..?
X

దిశ, ఫీచర్స్: సాధారణంగా మన ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగినా బంగారానికి విలువ ఇచ్చి దాన్ని కొనుగోలు చేస్తుంటాము. ఇక మహిళలకి అయితే పసిడి మీద ఉన్న ఇష్టం గురించి స్పెషల్‌గా చెప్పనక్కర్లేదు. ముక్కు పుడక నుంచి వడ్డానం వరకు అంతే ప్రేమగా కొంటారు. అయితే ఆ మధ్య కాలంలో గోల్డ్ ధరల్లో హెచ్చు తగ్గులు కనిపించగా, న్యూ ఇయర్ వచ్చినప్పటి నుంచి మాత్రం క్రమంగా పెరుగుతూనే ఉన్నాయి. ఇందులో భాగంగా నేడు కూడా బంగారం ధరలు భారీగా పెరిగాయి. దీంతో గోల్డ్ కొనాలంటేనే ప్రజలు భయపడిపోతున్నారు. ఇక ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడలో నిన్నటి ధరల మీద పోల్చుకుంటే 22 క్యారెట్ల బంగారం ధర పై రూ.350 కు పెరిగి రూ.72,600 ఉండగా.. అలాగే 24 క్యారెట్ల బంగారం ధర పై రూ.380 కు పెరిగి రూ.79,200 గా ఉంది. ఇక వెండి ధరలు మాత్రం స్థిరంగా కిలో రూ. 1,00,000గా ఉంది.

నేటి బంగారం ధర హైదరాబాద్‌లో ఎంతంటే

22 క్యారెట్ల బంగారం ధర - రూ.72,600

24 క్యారెట్ల బంగారం ధర - రూ.79,200

నేటి బంగారం ధర విజయవాడలో ఎంతంటే

22 క్యారెట్ల బంగారం ధర – రూ.72,600

24 క్యారెట్ల బంగారం ధర – రూ.79,200

Advertisement

Next Story