ఆ ఇద్దరి మీద మేము ఏనాడూ ఆధారపడలేదు.. ‘కాటేరమ్మ కొడుకు’ షాకింగ్ కామెంట్స్

by Gantepaka Srikanth |
ఆ ఇద్దరి మీద మేము ఏనాడూ ఆధారపడలేదు.. ‘కాటేరమ్మ కొడుకు’ షాకింగ్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: సన్ రైజర్స్ హైదరాబాద్(Sunrisers Hyderabad) స్టార్ ప్లేయర్ హెన్రిచ్ క్లాసెన్(Heinrich Klaasen) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. లక్నోతో మ్యాచ్ అనంతరం ఆయన మాట్లాడారు. ‘ఎస్ఆర్‌హెచ్(SRH) చాలా బలమైన జట్టు. మేము ఏనాడూ ఓపెనర్లు అయిన ట్రావిస్ హెడ్(Travis Head), అభిషేక్ శర్మ(Abhishek Sharma) మీద ఆధారపడలేదు. వాళ్లు 100 శాతం కష్టపడి.. జట్టుకు మంచి ఆరంభాన్ని ఇస్తున్నారు. అదొక మంచి పరిణామం. కానీ.. మొత్తంగా మేమేం ఆ ఇద్దరి మీదే భారం వేయలేదు, ఆధారపడలేదు. ఎస్ఆర్‌హెచ్‌లో 8వ నెంబర్ వరకు బ్యాటర్లు ఉన్నారు. సాదాసీదా బ్యాటర్లు కూడా కాదు.. అంతా హిట్టర్లే ఉన్నారు. కాబట్టి మా జట్టులో ఓపెనర్ల మీద ఒత్తిడి ఉండదు. వాళ్లు ఎలా ఆడిగా నడుస్తుంది. నిన్నటి మ్యాచ్‌లో ఒకట్రెండు వికెట్లు దురదృష్టవశాత్తు కోల్పోయాం. లేదంటే ఆ పిచ్‌పై కనీసం 220 స్కోర్ చేసేవాళ్లం. వచ్చే మ్యాచ్‌లో మరింత కష్టపడి విజయం సాధించేలా కృషి చేస్తాం’ అని హెన్రిచ్ క్లాసెన్ చెప్పుకొచ్చారు.

కాగా, నిన్నటి మ్యాచ్‌లో హైదరాబాద్‌పై లక్నో జట్టు విజయం సాధించింది. దీంతో ఈ ఐపీఎల్(IPL 2025) సీజన్‌లో లక్నో బోణీ కొట్టింది. ఉప్పల్‌ స్టేడియంలో 5 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. సన్‌రైజర్స్‌ నిర్దేవించిన 191 పరుగుల లక్ష్యాన్ని కేవలం 16.1 ఓవర్లలోనే 5 వికెట్లు కోల్పోయి చేధించింది. ఈ మ్యాచ్‌లో శార్దూల్‌ ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’గా ఎంపికయ్యాడు.

Next Story

Most Viewed