- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
Rakul Preet Singh: నమ్మి మోసపోవడమంతా భయంకరమైనది మరోటి లేదు.. షాకింగ్‌గా రకుల్ ప్రీత్ సింగ్ కామెంట్స్

దిశ, సినిమా: హీరోయిన్ రకుల్ ప్రీత్‌సింగ్ (Rakul Preet Singh) ప్రజెంట్ సెకండ్ ఇన్నింగ్స్ (Second innings)లోనూ తన సత్తా చాటుకుంటూ వరుస సినిమాలు చేస్తుంది. గతేడాది ఇండియన్-2 (Indian-2)తో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ అమ్మడు.. ప్రజెంట్ బాలీవుడ్(Bollywood)పై ఫోకస్ పెట్టింది. అక్కడ వరుస ఆఫర్లు అందుకుంటూ ఫుల్ బిజీగా మారింది. ఇదిలా ఉంటే.. తాజాగా ఓ ఇంటర్వ్యూ(Interview)లో పాల్గొన్న రకుల్ తన కెరీర్ స్టార్టింగ్(Career starting)లో ఎదుర్కొన్న కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకుంది.
‘నేను మోడలింగ్ చేస్తున్న టైమ్‌లో నాకు ఒక సినిమా చాన్స్ వచ్చింది. అప్పుడు నాకు సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీ (South Film Industry) గురించి అంతగా తెలియదు. అందుకే ఫస్ట్ చాన్స్ కోసం చాలా ఆలోచించి నాన్నను కూడా అడిగాను. ఆయన చెప్పడంతో ‘గిల్లీ’ మూవీలో యాక్ట్ చేశా. ఆ తర్వాత పూరీ జగన్నాథ్ (Puri Jagannath) ఫోన్ వచ్చింది. ఆయన 70 రోజులు డేట్స్ అడిగారు. ఆ టైమ్‌లో నాకు కాలేజ్ ఉండటంతో ఆ ఆఫర్ కూడా వదులుకున్నా’ అని చెప్పుకొచ్చింది. ఇక బ్రేకప్‌పై మాట్లాడుతూ.. ‘లైఫ్‌లో ప్రతి ఒక్కరికి బ్రేకప్స్ ఉంటాయి. వాటి నుంచి నేను ఎంతో నేర్చుకున్నాను. ఎవరినైనా నమ్మి విడిపోతే దానంత భయంకరమైన విషయం మరోటి ఉండదు. ప్రేమ చాలా గొప్పది. లైఫ్‌లో ఏదైనా లోటు ఉంటే అది వేరే వాళ్లు పూర్తి చేస్తారని ఎప్పుడూ అనుకోకూడదని. ఎవరి లైఫ్‌కు సంబంధించింది వాళ్లే చేసుకోవాలి.. జాకీ భగ్నానీని కలిసినప్పుడు మొదట దాని గురించే మాట్లాడాను. అలా మా ఆలోచనలు, అభిప్రాయాలు కలవడంతో పెళ్లి చేసుకున్నాము’ అంటూ చెప్పుకొచ్చింది.