- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
భర్త పనికి వెళ్లి వచ్చేలోగా దూలానికి వేలాడిన భార్య.. అసలేం జరిగింది..
by Sridhar Babu |

X
దిశ, దుగ్గొండి : ఉరి వేసుకొని వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన మండలంలోని తొగర్రాయిల గ్రామంలో శుక్రవారం చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం తొగర్రాయి గ్రామానికి చెందిన నల్ల ప్రవళికకు అదే గ్రామానికి చెందిన సుధాకర్ తో ఎనిమిది సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. వీరికి కుమార్తె సాన్వి, కుమారుడు విశ్వక్ ఉన్నారు. శుక్రవారం భర్త సుధాకర్ పనులకు వెళ్లాడు.
మధ్యాహ్నం ఇంటికి వచ్చేసరికి భార్య ప్రవళిక దూలానికి చీరతో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. వెంటనే స్థానికుల సాయంతో ఆమెను కిందకు దించగా అప్పటికే మరణించింది. తమ కుమార్తె మృతిపై ఎలాంటి అనుమానాలు లేవని మృతురాలి తల్లి చిలువేరు రాధ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నీలోజు వెంకటేశ్వర్లు తెలిపారు.
Next Story