Lava Bold 5G: మీ లవర్‎ ఫోన్ కావాలని బుర్ర తింటుందా.. లావా బోల్డ్ 5జీ స్మార్ట్ ఫోన్ కొనివ్వండి.. కేవలం రూ.10వేలే

by Vennela |
Lava Bold 5G: మీ లవర్‎ ఫోన్ కావాలని బుర్ర తింటుందా.. లావా బోల్డ్ 5జీ స్మార్ట్ ఫోన్ కొనివ్వండి.. కేవలం రూ.10వేలే
X

దిశ, వెబ్ డెస్క్: Lava Bold 5G: దేశీయ మొబైల్ తయారీదారు కంపెనీ అయిన లావా బడ్జెట్ ధరలో మరో కొత్త స్మార్ట్ ఫోన్ ను భారత్ లో లాంచ్ చేసింది. లావా బోల్డ్ 5జీ పేరుతో ఈ స్మార్ట్ ఫోన్ ను పరిచయం చేసింది. ఆకర్షణీయమైన లుక్ తో ఐపీ 64 రేటింగ్ తో మార్కెట్లోకి లాంచ్ చేసింది. కేవలం ఒక్క వేరియంట్ లోనే అందుబాటులోకి తీసుకువచ్చింది. 4జీబీ ప్లస్ 128 జీబీ వేరియంట్ ధర రూ. 10,499గా కంపెనీ నిర్ణయించింది. కాగా ఈ స్మార్ట్ ఫోన్ విక్రయాలు ఇప్పటికే ప్రారంభం అయినట్లు కంపెనీ తెలిపింది.

లావా కొత్త స్మార్ట్ ఫోన్ ఫీచర్ల విషయానికి వస్తే 6.67 అంగుళా ఫుల్ హెచ్డీ ప్లస్ అమోలెడ్ కర్వ్ డిస్ప్లే తో వస్తుంది. 120 హెచ్ జడ్ రేటుతో వస్తోంది. మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్ ను ఇందులో అమర్చారు. ఆండ్రాయిడ్ 14 ఆధారంగా ఈ ఫోన్ పనిచేస్తుంది. రెండేళ్లపాటు ఆండ్రాయిడ్ అప్ డేట్స్ తో దీన్ని తీసుకువచ్చారు. 64మెగాపిక్సెల్ సోనీ మెయిన్ కెమెరా, 16మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా కూడా ఇచ్చారు. 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 33 వాట్స్ ఛార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

లావా బోల్డ్ 5G ధర రూ.10,499 నుండి ప్రారంభమవుతుంది. ఈ ధర అన్ని ఆఫర్ల తర్వాత. ఈ హ్యాండ్‌సెట్ ఏప్రిల్ 8 నుండి అమెజాన్‌లో అందుబాటులో ఉంటుంది. కంపెనీ ఈ ఫోన్‌ను సఫైర్ బ్లూ కలర్‌లో విడుదల చేసింది. దీనితో పాటు, బ్రాండ్ ఇంట్లో ఉచిత సేవను కూడా అందిస్తోంది. ఫోన్ ఇతర వేరియంట్ల ధర ఇంకా వెల్లడించలేదు. ఈ బడ్జెట్‌లో వస్తున్న Realme, Redmi, Infinix ఇతర బ్రాండ్‌ల ఫోన్‌లతో ఇది పోటీపడుతుంది.

Next Story

Most Viewed