‘కేసరి చాప్టర్-2’ అప్డేట్ ఇచ్చిన అక్షయ్ కుమార్.. భయంకరమైన మారణహోమం అంటూ హైప్ పెంచుతున్న ట్వీట్

by Hamsa |
‘కేసరి చాప్టర్-2’ అప్డేట్ ఇచ్చిన అక్షయ్ కుమార్.. భయంకరమైన మారణహోమం అంటూ హైప్ పెంచుతున్న ట్వీట్
X

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్(Akshay Kumar) నటిస్తున్న తాజా చిత్రం ‘కన్నప్ప’(Kannappa). మంచు విష్ణు (manchu vishnu) డ్రీమ్ ప్రాజెక్ట్‌గా రాబోతున్న ఈ మూవీ ముఖేష్ కుమార్ సింగ్(Mukesh Kumar Singh) దర్శకత్వంలో తెరకెక్కుతోంది. అయితే ఈ సినిమాను కలెక్షన్ కింగ్ మోహన్ బాబు భారీ బడ్జెట్‌తో అవా ఎంటర్‌టైన్‌మెంట్స్, 24 ఫ్రేమ్స్ బ్యానర్స్‌పై నిర్మిస్తున్నారు. ఇందులో అక్షయ్ కుమార్‌తో పాటు పలువురు స్టార్ హీరోలు కూడా నటిస్తున్నారు. అయితే ‘కన్నప్ప’ చిత్రం ఏప్రిల్ 25న విడుదల కావాల్సి ఉండగా.. వాయిదా పడింది. ఇక ఈ సినిమాతో పాటు అక్షయ్ కుమార్ హిందీ ‘కేసరి చాప్టర్-2’లోనూ కీలక పాత్రలో నటిస్తున్నారు.

కరణ్ సింగ్ త్యాగి(Karan Singh Tyagi) దర్శకత్వంలో రాబోతున్న ఆ మూవీలో అనన్య పాండే(Ananya Pandey), స్టార్ నటుడు మాధవన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. అయితే ఈ చిత్రం 1919 ఏప్రిల్ 13న పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో జరిగిన జలియన్‌వాలాబాగ్ ఊచకోత ఆధారంగా రూపొందనుంది. ఏప్రిల్ 18న విడుదల కావాల్సి ఉండగా.. మూవీ మేకర్స్ ప్రమోషన్స్ జోరు పెంచారు. ‘కేసరి చాప్టర్-2’ నుంచి వరుస అప్డేట్ ఇస్తున్నారు. తాజాగా, అక్షయ్ కుమార్ ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ అప్డేట్ ఇచ్చారు. ఏప్రిల్ 3నరాబోతున్నట్లు తెలుపుతూ ‘‘1650 బుల్లెట్లు, 10 నిమిషాలు, 1 మ్యాన్ రంగంలోకి దిగబోతున్నాడు. భారతదేశాన్ని కుదిపేసిన భయంకరమైన మారణహోమం వెనుక నిజం బయటకు తీసేందుకే వస్తున్నాడు. కేసరిచాప్టర్2 ట్రైలర్ రేపు రాబోతుంది’’ అని రాసుకొచ్చారు. అలాగే ఓ పోస్టర్‌ను కూడా షేర్ చేశారు. ఇందులో నలుగురు వ్యక్తులు ఉండగా.. వారు కోపంగా చూస్తూ అందరిలో అంచనాలను పెంచుతున్నారు.



Next Story