Pawan Kalyan:‘మోడీ సర్కార్‌ నిధులు ఇవ్వడంతోనే..!’ డిప్యూటీ సీఎం పవన్ కీలక వ్యాఖ్యలు

by Jakkula Mamatha |   ( Updated:2025-01-08 13:26:04.0  )
Pawan Kalyan:‘మోడీ సర్కార్‌ నిధులు ఇవ్వడంతోనే..!’ డిప్యూటీ సీఎం పవన్ కీలక వ్యాఖ్యలు
X

దిశ,వెబ్‌డెస్క్: విశాఖలో ప్రధాని మోడీ రోడ్ షో అట్టహాసంగా జరిగింది. రెండు రోజుల పర్యటనలో భాగంగా పీఎం మోడీ రాష్ట్రానికి వచ్చారు. ఈ నేపథ్యంలో ఏపీ సీఎం చంద్రబాబు(CM Chandrababu), డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) ప్రధాని మోడీకి ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సిరిపురం జంక్షన్ నుంచి ఏయూ వరకు రోడ్ షో నిర్వహించారు. రాష్ట్రంలో రెండు లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులకు ఆమోదం తెలిపిన ప్రధాని మోడీ.. రోడ్ షో అనంతరం వాటికి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. అనంతరం ఏయూ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో జరిగిన సభలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రసంగించారు.

ధైర్య సాహసాలతో నింపితే అది పటిష్ట భారత్‌గా మారుతుందని, సదాశయంతో కన్యాకుమారి నుంచి కశ్మీర్‌ వరకు నడిస్తే.. అది స్వచ్ఛ భారత్‌ అవుతుందని తెలిపారు. సదుద్దేశం, సదాశయం ఉంటే ఏదైనా సాధ్యమేనని చెప్పారు. ప్రజలందరినీ మోడీ ఏకతాటిపై నడిపిస్తున్నారని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. ఐదేళ్ల అరాచక పాలనలో ఏపీ అంధకారంలో కూరుకుపోయింది. అభివృద్ధి అంటే ఆంధ్రా అనేలా కూటమి పనిచేస్తోంది. మోడీ(PM Narendra Modi) సర్కార్‌ నిధులు ఇవ్వడంతోనే.. మారుమూల గిరిజన గ్రామాలకు రోడ్లు వేయగలుగుతున్నాం అని తెలిపారు. అభివృద్ధిలో ఏ ప్రాంతం కూడా వెనుకబడకూడదని తెలిపారు. రూ.2లక్షల కోట్ల ప్రాజెక్ట్‌లతో 7లక్షల మందికి ఉపాధి కలుగుతుందన్నారు. మోడీ సంకల్పం, సహకారానికి నా కృతజ్ఞతలు అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed