- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
మేడిపల్లిలో హైడ్రా కమిషనర్ ఎంటర్
దిశ, మేడిపల్లి : మేడ్చల్ జిల్లా మేడిపల్లి మండలంలో బుధవారం హైడ్రా కమిషనర్ మొదటిసారిగా ఎంటర్ అయ్యారు. అక్రమార్కులకు గుబులు పుట్టించారు. లోకల్ కు వస్తున్నారనే సమాచారం రావడంతో స్థానికుల్లో అలజడి ప్రారంభమైంది. ఏ ప్రాంతానికి వస్తారో ఎక్కడ తమకు టెన్షన్ పెడతారో అని అక్రమ నిర్మాణదారులు వణికిపోయారు. కానీ తీరా చూస్తే గత రెండు సంవత్సరాల క్రితం పీర్జాదిగూడ వెస్ట్ కమలానగర్ కాలనీలో డెడ్ ఇండ్ రోడ్ కబ్జాచేసి మండపం నిర్మించారని సహజ యోగా ధ్యాన కేంద్రం కృష్ణ వారి టీమ్ ఫిర్యాదు మేరకు ఆ ప్రాంతానికి హైడ్రా కమిషనర్ రంగానాథ్ వచ్చారు. డెడ్ ఇండ్ రోడ్ కావడంతో క్లోజ్ గేట్ ను తొలగించి అందరూ కలిసి ఉపయోగించుకోవాలని ఇరు వర్గాలకు సూచించారు.
సమస్య ఎలా వచ్చిందో స్థానిక టౌన్ ప్లాన్ అధికారి సుకన్య ను అడిగి తెలుసుకున్నారు. కమిషనర్ వెళ్లిపోయే సమయానికి అక్కడికి మేడిపల్లి ఎమ్మార్వో హసీనా చేరుకున్నారు. సమస్యను వివరించే ప్రయత్నం చేశారు. ఇంతలో అక్కడ నుండి కమిషనర్ వెళ్లిపోయారు. కాగా యోగా ధ్యాన కేంద్రంలో ఎన్నో సంత్సరాల నుండి ఉచితంగా యోగా అందిస్తున్నామని , తమ ఆశ్రమం పక్కన మండపం నిర్మించారని, ఎందుకని ప్రశ్నిస్తే కాలనీ పార్క్ స్థలంలో బిల్డింగులు నిర్మించామని, ఇక్కడే స్థలం ఉండడంతో నిర్మించామని కాలనీ వాసులు బదులుఇచ్చారని సహజ యోగ ధ్యానం సభ్యులు కృష్ణ తెలిపారు. దీంతో హైడ్రా ను ఆశ్రయించామని తెలిపారు. ఇరువురు కలిసి స్థలాన్ని ఉపయోగించుకోవాలని కమిషన్ తెలిపారని చెప్పారు.